డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు | Sakshi
Sakshi News home page

డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు

Published Tue, May 7 2024 11:56 AM

Beneficiaries approach High Court against ECs Blocking DBT schemes

సాక్షి, విజయవాడ: పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎందుకంత కడుపుమంటో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు.. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్రకు తెరలేపాడు. 

అమల్లో ఉన్న సంక్షేమ పథకాలైన వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడ్డుకుంటూ, లబ్దిదారులకు డబ్బులు చేరకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది.

తాజాగా ఇప్పటి వరకు కొనసాగుతున్న  డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్ధులు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని లంచ్‌ మోషన్‌ కింద హైకోర్టు విచారించనుంది. 
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు 

 

Advertisement
 
Advertisement
 
Advertisement