AP Political News Jan 7th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Political News Jan 7th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Sun, Jan 7 2024 7:19 AM

AP Elections Political News Updates And Headlines 7th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

8:53 PM, జనవరి 7, 2024 
పశ్చిమగోదావరి జిల్లా: ఆచంట చంద్రబాబు ‘రా కదలిరా’ సభలో ఘర్షణ 

  • జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై టీడీపీ వలంటీర్లు, కార్యకర్తలు దాడి
  • జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులను అడ్డుకున్న టీడీపీ వలంటీర్లు, కార్యకర్తలు
  • ఇరువర్గాల మధ్య తోపులాట, పరస్పరం దాడులు

8:41 PM, జనవరి 7, 2024 
ఎన్నికలు ఎప్పుడొచ్చినా  వైఎస్‌ జగన్‌కే జనం పట్టం: మంత్రి తానేటి వనిత

  • బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ హయాంలో సామాజిక న్యాయం
  • అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా రాష్ట్రంలో పాలన
  • రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని  దూరం చేశారు.
  • సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు బురద చల్లుతున్నారు
  • పిల్లలకు అందించే ట్యాబులపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు
  • జగనన్న అందిస్తున్న పాలనలో కంటెంట్ ఉంది.. అందుకే ఆయన కటౌట్‌తో సాధికార బస్సు యాత్రలు చేయగలుగుతున్నాం.
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ జగన్‌కే జనం పట్టం కడతారు

7:34 PM, జనవరి 7, 2024 
వైఎస్సార్‌ జిల్లా: బద్వేలు టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి

  • తనకు టికెట్‌ ఇవ్వడం లేదని టీడీపీ అధిష్టానంపై డా.రాజశేఖర్‌ ఆగ్రహం
  • 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్‌
  • టికెట్‌ ఇవ్వకపోవడానికి తప్పుడు కారణాలు చెబుతున్నారు
  • పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్‌ ఇవ్వకపోవడం దారుణం
  • ఇక నుంచి ప్రతి గ్రామం తిరుగుతా
  • కలిసొచ్చే వారితో పోరాటం చేస్తా

6:47 PM, జనవరి 7, 2024 
చంద్రబాబు అబద్దాల కోరు: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

  • టీడీపీ పాలనలో 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదు
  • చంద్రబాబు మాయమాటలు నమ్మొద్దు
  • లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దే
  • జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకం
  • సీఎం జగన్‌ పేదల పక్షపాతి
  • ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల రూపాయల దాకా ఉచిత చికిత్స
  • మైనారిటీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి

6:08 PM, జనవరి 7, 2024 
ఆచంట: చంద్రబాబు ‘రా కదలిరా’ బహిరంగ సభకు ప్రజాదరణ కరువు

  • పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మొహం చాటేసిన తెలుగు తమ్ముళ్లు
  • సభలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు
  • జన సమీకరణకు నానా తిప్పలుపడ్డ టీడీపీ నేతలు
  • చంద్రబాబు సభకు చేరుకోగానే ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు
  • జనం లేక వెలవెలబోయిన సభా ప్రాంగణం

5:47 PM, జనవరి 7, 2024 
చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌

  • ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు
  • రా కదలిరా అంటే వచ్చేవారెవరూ లేరు
  • చంద్రబాబు, లోకేష్‌ ప్రజాదరణ లేదు
  • అధికారం కోసం ఏ గడ్డైన కరిచే వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
  • ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ హైదరాబాద్‌కు పోవాల్సిందే
  • చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి

5:12 PM, జనవరి 7, 2024 
ఊసరవెల్లి చంద్రబాబు: మంత్రి మేరుగ నాగార్జున

  • ఊసరవెల్లి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు
  • రాజ్యాంగబద్ధమైన అవకాశాలు రాకుండా చేశారు
  • చంద్రబాబు హయాంలో బీసీ ఎస్సీలపై అనేక దాడులు
  • కులం, మతం, వర్గం, పార్టీ తారతమ్యం లేకుండా అందరికీ సీఎం జగన్ న్యాయం
  • పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య చదివించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది
  • ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వమిది
  • పేదలకు 31 లక్షలు ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే

4:55 PM, జనవరి 7, 2024 
విశాఖ: మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్‌ను గెలిపించుకోవాలి: ఆర్‌. కృష్ణయ్య

  • బీసీలను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రతిపక్షాల ప్రయత్నాలు
  • సీఎం జగన్‌ పాలనలో బీసీలు ఎంతో ఆనందంగా ఉన్నారు
  • మళ్లీ సీఎంగా వైఎస్‌ జగన్‌ను గెలిపించుకోవాలి
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వైఎస్సార్‌ పెట్టారు.. ఆ తర్వాత చంద్రబాబు ఎత్తేశాడు
  • ప్రతిపక్షాల పార్టీల ప్రలోభాల్లో బీసీలు పడితే మనం 20 ఏళ్లు వెనక్కివెళ్తాం
  • మన పిల్లలు అభివృద్ధి చెందాలంటే సీఎంగా వైఎస్‌ జగన్‌ ఉండాలి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం సీఎం జగన్‌ పుట్టారు
  • 50 శాతం మనకి అవకాశాలు ఇచ్చారు సీఎం జగన్‌
  • అడగకుండానే సీఎం జగన్ వరాలు ఇస్తున్నారు

4:51 PM, జనవరి 7, 2024 
ఏపీలో 3 రోజులపాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన

  • రేపు విజయవాడ చేరుకోనున్న ఎన్నికల అధికారుల బృందం
  • రాష్ట్రానికి రానున్న సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు
  • ఎల్లుండి పార్టీలతో భేటీకానున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం
  • ఓటర్ల జాబితాలో తప్పులు, ఫిర్యాదుల పై రాష్ట్ర సీఈవోతో సమీక్ష
  • జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష
  • ఎన్నికల సన్నద్ధత పై ఈనెల 10న ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఈవో
  • కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో భేటీ
  • ఈ నెల 10న సా.4.30 గం.కు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం
  • సమావేశం తర్వాత ఢిల్లీ వెళ్లనున్న సీఈసీ, ఎన్నికల కమిషనర్లు

3:57 PM, జనవరి 7, 2024 
ఓ మీడియా ప్రతినిధికి మంత్రి బొత్స కౌంటర్‌

  • పార్టీలో అసంతృప్తి అంటూ ప్రశ్నించిన ఓ మీడియా ప్రతినిధికి మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌
  • అసంతృప్తి కొన్ని సంస్థలకు ఉంది
  • జాకీలు పెట్టి లేపినా.. క్రేన్‌లు పెట్టినా చంద్రబాబును గద్దెనెక్కించలేరు
  • సమన్వయకర్తల మార్పు సర్దుబాటు మాత్రమే
  • బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ సీటు ఇస్తారన్న విషయం నాకు తెలియదు.. మీరు చెప్తేనే తెలిసింది
     

3:49 PM, జనవరి 7, 2024
అసంతప్తి అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం: వేమిరెడ్డి

  • నెల్లూరు ఎంపీగా పోటీ చేయడంపై స్పష్టతనిచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
  • వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నా
     

2:59 PM, జనవరి 7, 2024
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు

  • జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తల ఫ్లెక్సీలు
  • ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు జెండాలతో  వచ్చిన టీడీపీ కార్యకర్తలు
  • జూ‌నియర్‌ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాసిన టీడీపీ కార్యకర్తలు
  • జెండాలను లాక్కొని పక్కన పడేసిన టీడీపీ నేతలు 
  • టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం

2:45 PM, జనవరి 7, 2024
కూటమిలో కుమ్ములాట

  • శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీలో ముసలం 
  • జనసేనతో కలిసి నాలుగు స్తంభాలాట 
  • కలమటకే టిక్కెట్‌ అంటూ ప్రచారం
  • వ్యతిరేకిస్తున్న మామిడి అండ్‌ కో
  • పాతపట్నంలో టీడీపీ నాలుగు స్తంభాలాట
  • తనకు టికెట్‌ ఖాయమైపోయిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రచారం
  • ఆయనకు టికెట్‌ ఇస్తే తానే ఓడిస్తానని మామిడి గోవిందరావు హెచ్చరిక
  • ఈ గొడవతోనే ఆ పార్టీకి తలనొప్పి కడుతుంటే ఆ పార్టీ పాత నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు తాజాగా తెరపైకి
  • తానూ ఇండిపెండెంట్‌గా అయినా పోటీలో ఉంటానని చెబుతున్న తేజేశ్వరరావు
  • ఈ జంఝాటం మధ్య జనసేన ఇన్‌చార్జి గేదెల చైతన్య తనకు కూడా సీటిస్తారని ఆశగా ఎదురుచూపు
  • ఇలా గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులతో పాతపట్నంలో పతనావస్థకు టీడీపీ రాజకీయం 

1:45 PM, జనవరి 7, 2024
నమ్మిన వాళ్లను నట్టేట ముంచే వ్యక్తి చంద్రబాబు: దేవినేని అవినాష్‌ 

  • టీడీపీలో కేశినేని ఎపిసోడ్‌పై స్పందించిన దేవినేని అవినాష్‌
  • వైఎస్సార్‌సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
  • సీఎం జగన్‌పై ప్రతిరోజూ బురదజల్లుతున్నారు 
  • టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసిన కేశినేని నానిని చంద్రబాబు ఎలా గౌరవించాడో అందరూ చూస్తున్నారు 
  • పార్టీ కోసం పదేళ్లు పనిచేస్తే తీసి పక్కన పెట్టేశారు 
  • టీడీపీలో క్యాష్ కొట్టు సీటు పట్టు అనే విధానం నడుస్తోంది 
  • నలుగురు వ్యక్తులను పంపించి కేశినేని నానిని బయటికి పంపించేశారు 
  • నమ్మిన వాళ్లను నట్టేట ముంచే వ్యక్తి చంద్రబాబు

1:15 PM, జనవరి 7, 2024
అంబేద్కర్‌ సిద్ధాంతాలు ప్రజలకు స్పూర్తిదాయకం: డొక్కా మాణిక్య వరప్రసాద్

  • విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభ పరిణామం
  • సీఎం జగన్‌.. అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పాలన చేస్తున్నారు
  • అంబేద్కర్ విగ్రహం భారతదేశంలోని అద్భుతమైన కట్టడంగా మిగిలిపోతుంది
  • అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రజలకు స్ఫూర్తిదాయకం

1:00 PM, జనవరి 7, 2024
మరి నీ సంగతేంటి చంద్రబాబు?

  • 2019లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలుపు.
  • వారిలో ఇద్దరికి(కేశినేని నాని చౌదరి, గల్లా జయదేవ్ చౌదరి) చంద్రబాబు టికెట్ ఇవ్వడం లేదు. 
  • అదే వైఎస్సార్సీపీ టికెట్ల గురించి ఎక్కడలేని చోద్యం చేస్తున్నాడు చంద్రబాబు
  • ఏదో జరిగిపోయినట్టు కాకమ్మ కథలు వండి వారుస్తున్నాయి పచ్చ మీడియా సంస్థలు
  • అసలు గెలిచేవారిని ఎవరు వదులుకుంటారు?
  • ఏడాది  క్రితం గడప గడపకు సందర్బంగా ప్రజల్లో ఆదరణ లేని వారికీ  టికెట్లు ఇవ్వను అని చెప్పిన సీఎం జగన్ 
  • తరువాత కూడా రెండు, మూడుసార్లు హెచ్చరించిన ముఖ్యమంత్రి జగన్‌
  • తాజాగా సర్వే లు చేసి ప్రజాదరణలో వెనకబడిన వారికి ముందు నచ్చ చెబుతున్నారు 
  • పార్టీలో ఉండి  కొత్త అభ్యర్ధికి సహకరించాలని కోరుతున్నారు. 
  • పార్టీకి ఉండి కష్టపడినందుకు కచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని హామీ ఇస్తున్నారు. 
  • అయినా కొంతమంది వెళ్ళిపోతారు.. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే
  • కానీ గెలుపే లక్షంగా  సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. 
  • కాబట్టే టీడీపీ, ఎల్లో మీడియాలో టెన్షన్‌ పడుతోంది. 

12:45 PM, జనవరి 7, 2024
ఓటర్లకు ఎల్లో బ్యాచ్‌ బెదిరింపులు

  • వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారా?
  • ఎన్నికలు అయిపోయి కౌంటింగ్‌ అయిన వెంటనే అంటూ బెదిరింపులు..
  • బరితెగించి టీడీపీ నేతల దౌర్జన్యం. 
     

12:35 PM, జనవరి 7, 2024
టూరిస్ట్‌ స్పాట్‌గా స్వరాజ్‌ మైదానం: మంత్రి కాకాణి

  • స్వరాజ్ మైదానంలో 19న సీఎం జగన్ చేతులు మీదుగా అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ ఉంటుంది.
  • మహనీయులు అంబేద్కర్‌కి సముచిత స్థానం ఇవ్వాలని విజయవాడలో అంబేద్కర్ విగ్రహన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఏర్పాటు చేస్తున్నారు..
  • ఆ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాం.
  • అంబేద్కర్ జీవిత చరిత్ర, ఆయన గొప్పతనం తెలిసేలా 10 రోజులు పాటు కార్యక్రమాలు చేస్తున్నాం.
  • రేపు(సోమవారం) రాష్టంలో ఉండే అంబేద్కర్ విగ్రహాలకు రంగులు, పూలమాలలు వేసి ప్రభుత్వ ఆఫీసుల్లో చిత్రపటాలను ఇవ్వడం జరుగుతుంది.
  • ఈనెల 9న అంబేద్కర్ జీవితం మీద సదస్సు ఏర్పాటు చేస్తున్నాం.
  • ఈనెల 10న రక్తదాన శిబిరాలు నిర్వహిస్తాం.
  • ఈనెల 11న జిల్లా స్థాయిలో అంబేద్కర్ ఫోటో ప్రదర్శన ఉంటుంది, వ్యాస రచన పోటీలు, క్విజ్ నిర్వహిస్తున్నాం.
  • ఈనెల 12న జిల్లా స్థాయిలో మానవహారాన్ని ఏర్పాటు చేసి, ఆయన జీవిత చరిత్రను తెలియజేసేలా కార్యక్రమాలు ఉంటాయి. 
     

12:15 PM, జనవరి 7, 2024
చంద్రబాబుకు మరో షాకిచ్చిన కేశినేని నాని

  • టీడీపీ జెండా పీకేసిన కేశినేని నాని
  • కేశినేని భవన్ నుండి టీడీపీ జెండా తొలగింపు
  • విజయవాడలో చంద్రబాబు సభ జరుగుతుండగానే కేశినేని ఝలక్
  • చంద్రబాబు సభలో కేశినేని కోసం కుర్చీ కేటాయింపు
  • చంద్రబాబు సభకి రావాలని నిన్న కనకమేడలతో ఆహ్వానం
  • చంద్రబాబు రాయభారాన్ని లెక్క చేయని కేశినేని నాని
  • చంద్రబాబు సభకి దూరంగా కేశినేని, ఆయన వర్గం

12:00 PM, జనవరి 7, 2024
బాబు ఆపు నీ నాటకం: వైఎస్సార్‌సీపీ

  • 40 ఏళ్ల రాజకీయ అనుభమున్నా ప్రజలకు చేసిందేమీ లేదు. 
  • 14 ఏళ్లు అధికారంలోకి ఉండి ఏనాడూ ఉద్దానం ప్రజల కష్టాలు వినలేదు.
  • నాలుగేళ్లలోనే సీఎం జగన్‌ వారి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించారు. 
  • సీఎం జగనే మా నమ్మకం. 

11:45 AM, జనవరి 7, 2024
చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ల షాక్‌

  • ఎన్టీఆర్‌ జిల్లాలో చంద్రబాబు సభను పట్టించుకోని తెలుగు తమ్ముళ్లు 
  • రా కదలిరా అంటూ వైన్ షాపుల వద్దకు పోతున్న టీడీపీ శ్రేణులు 
  • మందేసి ఎంజాయ్ చేస్తున్న క్యాడర్ 
  • కొద్దిసేపట్లో సభకు హాజరు కానున్న చంద్రబాబు 
  • సభలో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు 
  • జనసమీకరణకు నానా తిప్పలు పడుతున్న టీడీపీ నేతలు 
  • పొరుగు జిల్లా నుంచి ఆటోల్లో జనాన్ని తెస్తున్న నేతలు. 

11:30 AM, జనవరి 7, 2024
చంద్రబాబు, పవన్‌పై ప్రసన్న కుమార్‌ ఫైర్‌

  • చంద్రబాబు, పవన్‌పై ఘాటైన విమర్శలు చేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
  • చంద్రబాబు, పవన్ ఏకమైనా ఏమీ చేయలేరు. 
  • పవన్‌కు చంద్రబాబు రూ. 500 కోట్లు ఇచ్చి పొత్తులతో ముందుకు వస్తున్నారు.
  • చంద్రబాబు ఒకపక్క బీజేపీ, మరోపక్క కాంగ్రెస్ వాళ్లతో మంతనాలు జరుపుతున్నారు.
  • పేద ప్రజలు సీఎం జగన్‌ అండగా ఉన్నారు. 
  • బలిసిన వాళ్ళు మాత్రమే చంద్రబాబుకి అండగా ఉన్నారు.
  • ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎవరితో ఏకమైనా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు.

11:10 AM, జనవరి 7, 2024
అదంతా ఎల్లో మీడియా ఫేక్‌ ప్రచారం: వీపీఆర్‌ ఫైర్‌

  • నేను పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన వేమరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి. 
  • ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న వార్తల్లో నిజం లేదు. 
  • కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంపై స్పందించాల్సిన పనిలేదు. 
  • ముఖ్యమంత్రి జగన్‌ మాటే మాకు శిరోధార్యం. 
  • వచ్చే ఎన్నికల్లో నేను నెల్లూరు ఎంపీగీఆ పోటీ చేస్తున్నాను. 

10:50 AM, జనవరి 7, 2024
'తెలుగు దేశం'లో ధనస్వామ్యం

  • పైసలుంటేనే టీడీపీలో సీట్ల కేటాయింపు
  • పార్టీ కోసం ఎంత చేసినా పట్టించుకోని చంద్రబాబు
  • ఆది నుంచి జెండా మోసిన నేతలకు ఛీత్కారాలు
  • ధనబలం ఉంటేనే తనతో మాట్లాడాలని స్పష్టం చేస్తున్న టీడీపీ అధినేత
  • ఖర్చు పెట్టలేనివారు తన వద్దకు రావొద్దని చెబుతున్న చంద్రబాబు
  • తీవ్ర అవమానాలతో విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి పొగ
  • నాని స్థానంలో ఆయన సోదరుడు చిన్నికి అవకాశం
  • గుడివాడలో రావి వెంకట రమణను పక్కన పెట్టి ఎన్‌ఆర్‌ఐకి ఛాన్స్‌
  • కాకినాడలో ఎంపీ స్థానానికి జ్యోతుల నవీన్‌ స్థానంలో వ్యాపారవేత్త  సానా సతీష్ వైపు మొగ్గు
  • ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలకే చంద్రబాబు పెద్ద పీట
  • ఈ ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు ప్రజలకు సేవ చేస్తారా...?

10:35 AM, జనవరి 7, 2024
అంగన్‌వాడీలపై ఎస్మా నిర్ణయం ఎందుకంటే..?

  • బాలింతలు, గర్భిణులు, శిశువులకు..అందాల్సిన సేవల్లో అవరోధం లేకుండా చర్యలు
  • అంగన్‌వాడీల సమ్మెను తప్పుబడుతున్న ప్రభుత్వ వర్గాలు, ప్రజలు
  • అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఏపీది  3వ స్థానం
  • ఎన్నికలకు ముందు అంగన్‌వాడీలను రెచ్చగొడుతున్న చంద్రబాబు
  • బాబు ఐదేళ్ల పాలనలో అరకొర వేతనాలు చెల్లించిన వైనం
  • అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌
  • పెంచిన వేతనాలు నిరాటంకంగా చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • ఇప్పటికే సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలతో పలుమార్లు చర్చలు
  • 11 డిమాండ్లలో 10కి ఆమోదం..అయినా సమ్మె విరమించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్మా నిర్ణయం

10:15 AM, జనవరి 7, 2024
పొలిటికల్‌ డిఫెన్స్‌లో కాంగ్రెస్‌

  • చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందాలపై వస్తున్న విమర్శలతో వివరణలు ఇచ్చుకుంటున్న కాంగ్రెస్
  • ఇటీవల బెంగళూరులో చంద్రబాబుతో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ మంతనాలు
  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పూర్తిస్థాయిలో సహకారం అందించిన చంద్రబాబు
  • కాంగ్రెస్‌ను గెలిపించేందుకు తెలంగాణ బరిలో తెలుగుదేశం అభ్యర్థులను పోటీకి పెట్టని చంద్రబాబు
  • తెలంగాణలో చేసిన సాయానికి బదులుగా ఏపీలో సాయం చేయాలని శివకుమార్‌ను కోరిన చంద్రబాబు
  • చంద్రబాబు అభ్యర్థనల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను తీసుకున్న డీకే శివకుమార్
  • తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో ప్రకటించిన షర్మిల 
  • ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించేందుకు రెడీ అయినట్టు వార్తలు
  • సామాజిక వర్గాలు ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థులను టీడీపీ అనుకూలంగా బరిలో దించేందుకు అధిష్టానం ఏర్పాట్లు

9:50AM, జనవరి 7, 2024
నేడు 42వ రోజు సామాజిక సాధికార యాత్ర

  • ఉరవకొండ, రాజానగరం నియోజకవర్గాలలో జరగనున్న బస్సుయాత్ర
  • అనంతపురం జిల్లా ఉరవకొండలో  సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్సుయాత్ర
  • మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతల మీడియా సమావేశం
  • 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం
  • 4 గంటలకు అంబేద్కర్ సర్కిల్‌లో బహిరంగ సభ
  • హాజరుకానున్న మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషాశ్రీచరణ్, ఎంపీ తలారి రంగయ్య, తదితరులు
  • రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర
  • మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో వైసీపి నేతల మీడియా సమావేశం
  • అనంతరం కోరుకొండ వరకు జరగనున్న బస్సుయాత్ర
  • 3 గంటలకు కోరుకొండ బూరుగుపూడి గేట్ వద్ద బహిరంగ సభ
  •  హాజరుకానున్న మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీనటులు అలీ, తదితరులు

9:30AM, జనవరి 7, 2024

చంద్రబాబుకు షాకిచ్చిన కేశినేని నాని వర్గం 

  • తిరువూరులో జరగనున్న రా కదలిరా సభకు దూరంగా కేశినేని వర్గం 
  • నందిగామకు చెందిన జీవరత్నం అతని అనుచరులు 
  • తిరువూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అతని వర్గం

8:32AM, జనవరి 7, 2024

సామాజిక న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం

  • అన్ని రంగాల్లోనూ బీసీ ఎస్సీ ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేశారు
  • విజయవాడలో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడం చారిత్రాత్మక నిర్ణయం
  • జనవరి 19 న సిఎం జగన్ చేతులు మీదుగా అంబేద్కర్ విగ్రహ ప్రారబోత్సం వానికి, రాష్ట్రంలో ఉన్న దళితులు అందరూ పెద్ద ఎత్తున హాజరవ్వాలి
  • సిఎం జగన్ దళితుల పక్షపాతి
  • 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాలి
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటి మిల్లి మంగ రాజు

7:30AM, జనవరి 7, 2024
బస్సు ఛార్జీలపై పచ్చ బ్యాచ్‌ ఫేక్‌ ప్రచారం

  • ఏపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
  • ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలపై కొత్తగా ఫేక్‌ ప్రచారం
  • బెంగళూరు టూ మదనపల్లి ఛార్జీలపై తప్పుడు లెక్కలు.
  • అసలు నిజాలు ఇవే..

7:15AM, జనవరి 7, 2024
చంద్రబాబును హిట్లర్‌తో పోల్చిన కేశినేని నాని

  • టీడీపీకి షాకిస్తూ కేశినేని సంచలన కామెంట్స్‌
  • ఇప్పుడు చంద్రబాబును హిట్లర్‌తో పోల్చిన నాని 

7:10 AM, జనవరి 7, 2024
షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు: సజ్జల రామకృష్ణారెడ్డి

  • బ్రదర్‌ అనిల్‌ను టీడీపీ నేతలు గతంలో ఎలా ఆరోపించారో చూశాం..
  • ఇప్పుడు పక్కన నిలబడి అదే టీడీపీ నేతలు ఫొటోలు దిగుతున్నారు
  • వైఎస్సార్‌సీపీ తొలిరోజుల్లోనే కాంగ్రెస్‌ పార్టీ వివేకాను బరిలోకి తెచ్చింది
  • వైఎస్సార్‌ మరణంలోనూ కాంగ్రెస్‌ పార్టీపై అనుమానాలున్నాయి
  • కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది
  • ఇష్యూను డైవర్ట్‌ చేయడానికే బాబు ఇలాంటి  కుట్రలు చేస్తున్నారు
  • షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది
  • షర్మిల వల్ల YSRCPకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నష్టం ఏమీ ఉండదు
  • షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారు
  • సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలో షర్మిల, బ్రదర్‌ అనిల్‌ వెళ్లారు
  • ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు
  • టీడీపీ నేత బీటెక్ రవిని... బ్రదర్ అనిల్‌ కలవడం ఇవన్నీ అందులో బాగమే
  • వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆ రోజు నుంచే అనుమానాలున్నాయి
  • టీడీపీ, కాంగ్రెస్ కలిసే నాడు వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు మోపాయి
  • కాంగ్రెస్‌ నేతగా, ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్సార్‌ చనిపోయారు
  • ఆయన చనిపోయాక.. పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు
  • విజయమ్మకు పోటీగా పులివెందుల నుంచి వైఎస్‌ వివేకానందరెడ్డిని కాంగ్రెస్‌ బరిలో దించింది
  • YSRCP అభ్యర్థిగా విజయమ్మకు 70శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా వివేకాకు 20శాతం ఓట్లు కూడా రాలేదు
  • కాంగ్రెస్ తో ఎప్పుటి నుంచో చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటున్నాడు
  • చంద్రబాబు తనకేం కావాలో ఓ కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడు
  • సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయి
  • అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు
  • కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
  • ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు
  • కాంగ్రెస్ పార్టీని మేము పట్టించుకో, పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు
  • ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలే
  • రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్లీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు?
  • కుటుంబం కోసం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి  YSRCPని పెట్టలేదు
  • ఒక పార్టీగా మా విధానాలు మాకు ఉన్నాయి

7:00 AM, జనవరి 7, 2024
చంద్రబాబు మాయలు అన్నీ ఇన్నీ కావయ్యా.!

  • 2014లో పాయ‌క‌రావుపేట‌లో గెలిచిన వంగ‌ల‌పూడి అనితను 2019లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరుకు మార్చాడు బాబు 
  • కొవ్వూరు నుంచి మాజీ మంత్రి కేఎస్‌ జవహర్ ను  కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చాడు
  • చంద్రగిరిలో ఓడిన చంద్రబాబు కుప్పంకు పారిపోయాడు
  • కోడెలను నరసరావు పేట నుంచి సత్తెనపల్లికి  మార్చాడు
  • ఇక గంటా అయితే ఒక్కో ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు
  • ఇన్ని చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారంటూ YSRCP మీద ఏడుస్తున్నాడు.

ఏపీలో పొత్తుల పై స్పష్టతనిచ్చిన కాంగ్రెస్

  • మతతత్వ బీజేపీతో మాది రాజీలేని పోరాటం
  • టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం
  • బీజేపీతో వైసీపీ కలిసి నడుస్తోంది
  •  ఏపీలో ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా I.N.D.I.A కూటమి పార్టీలతో కలిసి పోరాడుతాం
  •  ట్విట్టర్‌లో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాకూర్

Advertisement
Advertisement