-
జాతీయ ఉత్తమ చిత్రం ‘షిప్ ఆఫ్ థీసీయస్’
* జాతీయ అవార్డుల ప్రకటన *షాహిద్ చిత్ర దర్శకుడు మెహతాకు ఉత్తమ దర్శకుడి పురస్కారం * ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా భాగ్ మిల్కా భాగ్ తెలుగు చిత్రానికి మూడు అవార్డులు న్యూఢిల్లీ: 61వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2013 సంవత్సరానికిగానూ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో హిందీ సినిమాల హవా నడిచింది. ప్రధాన విభాగాలన్నిటిలోనూ బాలీవుడ్ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. జాతీయ ఉత్తమ చిత్రంగా ఆనంద్ గాంధీ దర్శకత్వం వహించిన ‘షిప్ ఆఫ్ థీసీయస్’ (హిందీ-ఇంగ్లిష్) ఎంపికైంది. ఆనంద్ గాంధీకి ఇదే తొలిచిత్రం కావడం విశేషం. గుర్తింపు, నమ్మకం, మరణం వంటి సంక్లిష్టమైన అంశాలను ‘షిప్ ఆఫ్ థీసీయస్’లో సమర్థవంతంగా తెరకెక్కించడంతో ఆనంద్ గాంధీ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త షాహిద్ అజ్మీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘షాహిద్’ డెరైక్టర్ హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కింది. షాహిద్ చిత్రంలోనే నటించిన రాజ్‌కుమార్ రావ్, మలయాళ చిత్రం పెరారియావతర్లో నటించిన సూరజ్ వెంజారమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా పురస్కారం దక్కించుకున్నారు. హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తెరకెక్కిన ‘భాగ్ మిల్కా భాగ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సయీద్ అక్తర్ మీర్జా నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ 310 చిత్రాలను వడపోసి జాతీయ అవార్డులను ఎంపిక చేసింది. మే 3వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన ప్రముఖ కవి, సినీ గీత రచయిత, దర్శకుడు గుల్జార్‌కు అదే రోజు అవార్డు అందించనున్నారు. జాతీయ అవార్డు రావడంతో చాలా ఉద్వేగానికి గురయ్యా అని షిప్ ఆఫ్ థీసీయస్ దర్శకుడు ఆనంద్ గాంధీ చెప్పారు. ఈ అవార్డును షాహిద్ అజ్మీకి అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. అవార్డులు ఎవరికి? ఉత్తమ చిత్రం: షిప్ ఆఫ్ థీసీయస్ (హిందీ-ఇంగ్లిష్) ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్-హిందీ) ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (షాహిద్-హిందీ), సూరజ్ వెంజారమూడు(పెరారియావతర్-మలయాళం) ఇద్దరికి సంయుక్తంగా ఉత్తమ నటి: గీతాంజలి థాపా (లయర్స్ డైస్-హిందీ) ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: భాగ్ మిల్కా భాగ్ (హిందీ) ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్ఎల్బీ ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం(నర్గీస్ దత్ అవార్డు): బాలు మహేంద్ర (తలైమురైగల్-తమిళం) ఉత్తమ బాలల చిత్రం: కపాల్ (హిందీ) ఉత్తమ నేపథ్య గాయకుడు: రూపాంకర్ (జాతీశ్వర్-బెంగాలీ) ఉత్తమ నేపథ్య గాయని: బెలా షిండే (తుహ్యా ధర్మ కొంచా-మరాఠీ) ఉత్తమ మాటల రచయిత: సుమిత్రా భావే(అస్తు-మరాఠీ) ఉత్తమ పాటల రచయిత: ఎన్ఏ ముత్తుకుమార్ (తంగా మింకాల్-తమిళం) ఉత్తమ నృత్య దర్శకత్వం: గణేశ్ ఆచార్య(భాగ్ మిల్కా భాగ్-హిందీ) ఉత్తమ సంగీత దర్శకత్వం: కబీర్ సుమన్ (జాతీశ్వర్-బెంగాలీ) ఉత్తమ సామాజికాంశ చిత్రం: గులాబ్ గ్యాంగ్(హిందీ) తెలుగు వెలుగులు... ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: నా బంగారు తల్లి ఉత్తమ నేపథ్య సంగీతం: శంతనూ మొయిత్రా(నా బంగారు తల్లి) స్పెషల్ జ్యూరీ పురస్కారం: అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి) ఉత్తమ సినిమా పుస్తకం: సినిమాగా సినిమా (నందగోపాల్-తెలుగు) -
ఉత్తమ తెలుగు చిత్రం 'నా బంగారు తల్లి'
న్యూఢిల్లీ: 61వ జాతీయ సినిమా అవార్డులను బుధవారం ప్రకటించారు. ఆనంద్ గాంధీ దర్శకత్వంలో నిర్మించిన 'షిప్ ఆఫ్ తెస్యుస్' ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. 'భాగ్ మిల్కా భాగ్' ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. 'షహీద్' సినిమాను రూపొందించిన హన్సల్ మెహతా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. 'షహీద్' నటించిన రాజ్‌కుమార్, 'పెరారియాతవర్'లో నటించిన సూరజ్ వెంజారుమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. 'లియర్ డీస్'లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. 'జోలీ ఎల్ఎల్ బీ' లో నటించిన సౌరభ్ శుక్లా ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా 'నా బంగారు తల్లి' ఎంపికయింది. జాతీయ ఉత్తమ నేపథ్య సంగీత అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. శాంతారాం మొయిత్రా సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో నటించిన అంజలి పాటిల్‌కు ప్రత్యేక ప్రశంస దక్కింది. 'సినిమాగా సినిమా'కు ఉత్తమ సినిమా పుస్తక అవార్డు లభించింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement