-
ట్రా'వైల్డ్ '
ప్రస్తుతం జర్మనీలో అక్టోబర్ ఫెస్ట్ జరుగుతోంది. అయితే మనలోచాలా మందికి ఆ ఫెస్ట్‌నే తెలియదు. కానీ సిటీకి చెందిన మిత్ర బృందం మాత్రం ఇప్పుడు అక్కడే ఉంది. ఇప్పుడే కాదు... తరచూ విదేశీవిహారంలో మునిగి తేలుతోంది. కేవలం టూర్లు చేయడంతోసరిపెట్టుకోకుండా తిరిగి వచ్చాక తమ టూర్ విశేషాలతో ఫొటోఎగ్జిబిషన్ సైతం నిర్వహిస్తోంది. తద్వారా వచ్చిన ఆదాయాన్నివన్యప్రాణుల సంక్షేమం కోసం అందిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : ఘడియల్ని పైసలతో కొలిచే మనస్తత్వం. టూర్లు, షికార్లు అంటే టైమ్ వేస్ట్ వ్యాపకాలని తీసిపారేసే తత్వం. సింపుల్‌గా... బిజినెస్ మెన్ అంటే క్షణం తీరికలేని జీవితం. నగరానికి చెందిన నలుగురు స్నేహితుల బృందం మాత్రం దీనికి అతీతం. రూ.కోట్ల టర్నోవర్ ఉండే వ్యాపారాలు చేస్తున్నా... అభిరుచిని మాత్రం అటకెక్కించలేదు. వైల్డ్‌లైఫ్ మీ దున్న ఆసక్తితో దేశాలు చుట్టేస్తున్న వీరు... తమ ప్రయాణ ‘చిత్రాల’తో సిటీలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమ టీమ్ ‘వైల్డ్’ టూర్స్ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు బృందంలో ఒకరైన బిజినెస్ మెన్, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీకి పేరొందిన శ్రీనివాస్ హేచరీస్ యజమాని సురేష్ చిట్టూరి. ప్రయాణం.. ఓ అవసరం వ్యక్తిగతంగా నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే 78 దేశాలు తిరిగాను. త్వరలోనే 100 దేశాలు పూర్తి చేస్తాను. ప్రయాణాలు మన ఆలోచనల్ని మరింత విస్తృతం చేస్తాయి. కొన్నేళ్ల క్రితం ఈ జర్నీలో నాకు మరో ముగ్గురు స్నేహితులు (జీవీ ప్రసాద్ – రెడ్డి ల్యాబ్స్ సీఈఓ, బి.గౌతమ్ – గ్రీన్‌పార్క్ హోటల్స్ సీఈఓ, గోపిరాజు) తోడయ్యారు. అప్పటి నుంచి వీరితో కలిసి వైల్డ్‌లైఫ్ టూర్స్ ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు వన్యప్రాణి నివాస ప్రాంతాలను చుట్టేశాం. ముందుగా స్టడీ చేసి కరెక్ట్ సీజన్ ఎంచుకొని, అకామిడేషన్ అరెంజ్ చేసుకుంటాం. ఒక్కో చోట కనీసం వారం నుంచి 10 రోజులు ఉంటాం. ఆరేడు సంవత్సరాలుగా టూర్స్‌కి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అంటార్కిటికా వెళ్లాలని ఉంది. అక్కడికి వెళ్లాలంటే 20 రోజులు కావాలి. కానీ అంత టైమ్ దొరకడం లేదు. యురేకా... దక్షిణాఫ్రికా వైల్డ్‌లైఫ్ లవర్స్‌కు సిసలైన గమ్యం అంటే సౌతాఫ్రికా అని చెప్పాలి. ఆఫ్రికా అంటే బిగ్ఫైవ్ చూడ్డానికి వెళ్లాలి అంటారు. అంటే... సింహం, ఏనుగు, బఫెల్లో, రైనోసార్స్, జిరాఫీ అన్నమాట. అక్కడ మనలా చెట్లు అవీ ఉండవు. ఆరేడు అడుగుల ఎత్తులో గడ్డి పెరిగే గ్రాస్‌ల్యాండ్స్ బాగా ఉంటాయి. సింహం సహా వివిధ రకాల జంతువులన్నీ అక్కడ పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. ఆవు జాతికి చెందిన ఓ జంతువుల మంద లక్షల సంఖ్యలో ఉంటుంది. టూరిజమ్‌కి ఇది ప్రత్యేక ఆకర్షణ. ఈ జంతువులు సంవత్సరమంతా గుండ్రంగా తిరుగుతాయి. వీటిని సింహాలు, ముసళ్లు పట్టుకొని చంపే ఫొటోలు తీయడం ఒక క్రేజ్. జర్నీ అడిక్షన్... లైఫ్ ‘విన్’ పుస్తకాలు, చదువు, పని... ఇలా ఏవీ నేర్పని దాన్ని ప్రయాణం నేర్పుతుంది. నా విజయానికి ఈ టూర్స్ తిరిగే అడిక్షన్ ఒక ప్రధాన కారణం. విభిన్న ప్రాంతాలకు వెళ్లడం వల్ల కొన్ని నమ్మకాలు, సంస్కృతులు మనకు జీవితంపై కొత్త దృక్పథాన్ని అందిస్తాయి. ప్రస్తుతం మన దేశంలో వెజిటేరియనిజమ్ని ప్రమోట్ చేస్తున్నాం. అయితే అదే సమయంలో ప్రతి జీవమున్న ప్రాణినీ తింటారు జపనీయులు. మరి వాళ్ల ఆరోగ్యం, ఫిట్నెస్ మనకన్నా చాలా మెరుగ్గా ఉంటాయి. పాత సంప్రదాయాలు, విశ్వాసాలను ప్రశ్నించడం ఎలా అనేది మనం ప్రయాణాల్లో నేర్చుకుంటాం. కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారైనా ఏదో ఒక కొత్త ప్లేస్ చుట్టి రావడమనేది అలవాటుగా మార్చుకోవాలని నా అభిప్రాయం. భావితరాలూ చూడాలి... వన్యప్రాణులను భావితరాలూ చూడాలి. వాటి సంరక్షణ చాలా అవసరం. కేవలం జంతువులను చూడడం కోసం టూర్స్ వెళ్లి వచ్చేయడం కాకుండా... వాటి మనుగడ కోసం మనం ఏమైనా చేయగలమా అనే ఆలోచనతో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. ట్రిప్ వెళ్లి వచ్చినప్పుడల్లా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాం. వీటిని ఫ్రెండ్స్/పరిచయస్థుల కోసం విక్రయిస్తున్నాం. వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నాం. ఏటా సుమారుగా రూ.4లక్షల నుంచి రూ.5లక్షల దాకా ఇస్తుంటాం. గొరిల్లా... భళా కేవలం గొరిల్లాలను చూడ్డానికి రువాండా వెళ్లాం. అక్కడ గొరిల్లాలు తప్ప పెద్దగా ఏమీ లేదు. వాటిని అత్యంత సమీపం నుంచి చూడడం వింత అనుభూతిని అందించింది. మనం ఏమీ అనకపోతే అవి ఏమీ అనవు. ఒక్కోటి 300–400 కేజీల వరకు బరువుంటాయి. ఒకప్పుడు వీటిని రకరకాల అవసరాల కోసం బాగా చంపేసేవారు. అయితే ఇప్పుడు బాగా తగ్గింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనంత సంఖ్యలో ఇప్పుడు ఉన్నాయి. మౌంటెయిన్ గొరిల్లా, ల్యాండ్ గొరిల్లాస్ అని రెండు రకాలు ఉంటాయి. ల్యాండ్ గొరిల్లాస్ వెస్ట్ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి. ఓర్పు ముఖ్యం.. బిజినెస్‌లో బిజీ ఉండదని కాదు... కానీ ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఉంటే ఎన్ని పనులన్నా చేయొచ్చు. పెద్ద పెద్ద అనుభూతులు కావాలంటే చిన్నచిన్నవి పట్టించుకోవడం మానేయాలి. ప్రయాణానికి కావాల్సింది ఓర్పు. ఉదాహరణకి నా వైల్డ్‌లైఫ్ పిక్చర్స్ కోసం స్పాట్‌కి వెళ్లడానికి ఒకట్రెండు రోజులు పడుతుంది. డేలైట్ కోసం వేచి చూడాలి. జంతువు బయటకు వచ్చే వరకు, అది చురుగ్గా మారే వరకు నిరీక్షించాలి. అయితే సరైన షాట్ వచ్చినప్పుడల్లా జీవితంలో ఒక మైలురాయిని దాటినట్టే అనిపిస్తుంది. కొన్ని టిప్స్.. ⇔ ప్యాకేజ్ టూర్స్‌కు దూరమవ్వండి. ⇔ విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇండియన్ ఫుడ్ కోసం అన్వేషించకండి. ⇔ ఫేస్బుక్ పేజీ ఉందనిపించే ఏ ప్లేస్ అయినా అప్పటికే కరప్టెడ్ అని గుర్తించండి. ⇔ పూర్తిగా స్టడీ చేసి మాత్రమే ప్లేస్‌ను ఎంచుకోండి. -
పొంగి పొర్లే పండుగ
అక్టోబర్ ఫెస్ట్ ఒక నగరాన్ని కోటి మంది అతిథులు ముంచెత్తేస్తారు. కేవలం పదహారు రోజుల్లో... కోటి లీటర్ల బీరు ఖాళీ చేసేస్తారు. టన్నుల కొద్దీ మాంసం, ఇతర ఆహారం ఖర్చయిపోతుంది. నిజం!! ఇదో పార్టీ. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఒకటీ రెండూ కాదు... ఏకంగా రెండు వందల ఏళ్లకు పైబడి నడుస్తోంది. అదే... అక్టోబర్ ఫెస్ట్. జర్మనీలోని మ్యూనిక్ నగర స్పెషాలిటీ. వీధుల్లోంచి వెళ్లే బ్యాండు వాయిద్యాలు వింటూ... బీరు ఖాళీ చేసేయ్యెటమే ఈ పండగ ప్రత్యేకత. చారిత్రక సంప్రదాయాల మేరకు జరిగే ఈ పండగలో... అతిథులూ యూనిఫామ్స్ ధరిస్తారు. కొందరు అభిమానుల డైరీల్లో ఏటా ఈ పండగ ఉండాల్సిందే. మిగిలిన వారు కూడా... జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకోకుండా ఉంటారా?. మ్యూనిక్‌కు వెళ్లేదెలా? హైదరాబాద్‌తో పాటు ముంబయి, ఢిల్లీ నుంచి మ్యూనిక్‌కు నేరుగా విమానాలున్నాయి. అక్టోబర్ ఫెస్ట్‌లో యాత్రికుల తాకిడి ఎక్కువ కనక టిక్కెట్లు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా బుక్ చేస్తే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.40 వేల లోపే ఉంటాయి. ఏ సీజన్ మంచిది? సెప్టెంబరు నెలాఖర్లోనే వెళ్లాల్సి ఉంటుంది. సెప్టెంబరు మూడో వారం నుంచి అక్టోబర్ ఫెస్ట్ ఆరంభమవుతుంది. -
పారిస్‌లో బీర్ ఫెస్టివల్
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్‌బ్లాంక్! వీడియో
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
తప్పక చదవండి
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement