పార్టీలకతీతంగా సమైక్యానికి మద్దతివ్వండి: వైఎస్ జగన్

పార్టీలకతీతంగా సమైక్యానికి మద్దతివ్వండి: వైఎస్ జగన్ - Sakshi

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ..తాను, మరో ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్సీలు, 23 ఎమ్మెల్యేలందరూ, డిస్ క్వాలిఫై అయిన 13 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలమందరం కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  అఫిడవిట్ ను అందచేశామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.  సమైక్యానికి తోడుగా నిలబడుతారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలపై ఆలస్యంగా వేటు వేశారని జగన్ అన్నారు. 


 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినపుడు అనర్హత వేటు వేయకుండా.. ఒక సంవత్సరంలోపూ అయితే ఉప ఎన్నికలు జరుగవు అనే విషయం తెలుసుకున్న తర్వాతే ఆలస్యంగా అనర్హత వేటు వేశారని జగన్ తెలిపారు. అలా డిస్ క్వాలిఫై అయిన ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్టు జగన్ తెలిపారు. 


 


సకాలంలో అనర్హత వేటు వేస్తే.. సకాలం ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేలుగా గెలిచి. సమైక్యానికి మద్దతు తెలుపుతారనే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారన్నారు. తాజా ఎమ్మెల్యేలు కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము సమర్పించిన విధంగానే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీల కతీతంగా వెళ్లి అఫిడవిట్లు దాఖలు చేయాలని జగన్ సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అఫిడవిట్లు ఇవ్వకుండా చంద్రబాబు ఆపుతున్నారన్నారు. చంద్రబాబు, కిరణ్ మాట వినకుండా ఎమ్మెల్యేలు తమ ఆత్మసాక్షిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రార్ధిస్తున్నానని జగన్ అన్నారు. చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని జగన్ సూచించారు.


 


రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని చెబుతూనే ఇటీవల సచివాలయంలోని 56 డిపార్ట్ మెంట్లకు ముఖ్యమంత్రి నోట్ పంపించారు.  విభజనకు సంబంధించిన అంశాలను సేకరించడానికి ఉద్యోగులందరూ నివేదిక అందించాలని నోట్ పంపించారు. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన చేయాలని కిరణ్ కోరుకుంటున్నారు. విభజనపై స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్ జగన్ నిలదీశారు.   గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన విభజన గురించి స్పీకర్, ముఖ్యమంత్రిలకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు 


 


రాష్ట్రాన్ని విడిగొట్టిన పరిస్థితులు కిరణ్, స్పీకర నాదెండ్ల మనోహర్ లను తెలుసా అని ప్రశ్నించారు. లక్నో పర్యటనకు వెళ్లిన స్పీకర్‌ను ఒక విషయం అడగదలుచుకున్నాను అని అన్నారు. ఉత్తరాఖండ్‌ ఏర్పడినప్పుడు ఏం జరిగిందో ఆమేరకు అవగాహన స్పీకర్‌కు ఉందా? అని అడగదలుచుకున్నా అని జగన్‌ అన్నారు. ఆమేరకు స్పీకర్, సీఎంలకు బుద్ధి, జ్ఞానం వీరికి ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నా అని: వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌ను విడగొట్టడానికి అభ్యంతరం లేదని యూపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇవాళ తీర్మానం అనే పదానికి అర్థంలేకుండా చేశారు జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  అక్కడకు, ఇక్కడకు తేడా తెలియదా? అని అడగదలుచుకున్నా అన్నారు.  అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయకుంటే సీఎం కిరణ్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు వైఎస్‌ జగన్‌ అన్నారు.  సభలో ఆమోదం తెలిపిన తర్వాత విభజన కోసం డ్రాఫ్ట్ బిల్లు రూపొందాలని .. ఎలాంటి తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలు విభజన చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. 


 


అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తే దానిని కోర్టు ముందు ఉంచుతాం అని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం లేకుండానే చర్చ చేపడుతారా అని అన్నారు. కిరణ్, చంద్రబాబుల మాటలు వినకుండా అందరూ ఎమ్మెల్యేలు సమైక్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమైక్య తీర్మానం చేస్తే పార్లమెంట్ లో మన బలం పెరుగుతుంది. రాష్ట్రాన్ని విభజన చేయకుండా ఆపే శక్తి మనకు వస్తుంది అన్నారు. 


 


రాష్ట్రం విడిపోతే మనం సర్వనాశనం అవుతామని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మన రాష్ట్రానిది అతిపెద్ద మూడవ బడ్జెట్ అని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తామ చేసిన విజ్క్షప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి దేవుడ్ని ప్రార్ధిస్తున్నాం అని అన్నారు. ప్రధాని పీఠంపై కూర్చోడవడానికి సహకరించిన రాష్ట్రంతోనే కాంగ్రెస్ హైకమాండ్ ఆడుకుంటుందని  వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top