మాటలు నేర్చిన రామచిలుక ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. మనం మాట్లాడిన మాటల్నే ముద్దుముద్దుగా అది వల్లేవేస్తుంది. కానీ, ఓ రామచిలుక మాత్రం తాను నేర్చిన మాటలతో తన ఇంటి ఆసామి బండారం బట్టబయలు చేసింది. పనిమనిషితో రహస్యంగా శృంగారలీలలు జరుపుతూ.. ఆమెతో ఆయన చెప్పిన ముద్దుముద్దు మాటల్ని ఆ చిలుక భార్య ముందు పలికేసింది. దాంతో పనిమనిషితో ఆయన జరుపుతున్న రహస్య రాసలీలలు బట్టబయలయ్యాయి. దీంతో ఇప్పుడాయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటన కువైట్‌లో జరిగింది. పనిమనిషితో భర్త రహస్యంగా జరుపుతున్న రాసలీలల గురించి పెంపుడు చిలుక గుట్టువిప్పడంతో భార్య ఆయన మీద కేసు పెట్టింది. వారిద్దరి రహస్యంగా మాట్లాడుకున్న మాటల్ని చిలుక పదేపదే వల్లే వేయడంతో వారిపై తనకు అనుమానం కలిగినట్టు హవాల్లి పోలీసు స్టేషన్లో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భర్త తనను మోసం చేస్తున్నాడని తనకు చాలాకాలంగా అనుమానంగా ఉందని, చిలుక మాటలతో ఈ అనుమానం నిజమైందని తెలిపింది. తాను ఆఫీసు నుంచి త్వరగా వస్తే భర్త ఆశ్చర్యపోతున్నాడని, కుంగిపోయి కనిపిస్తున్నాడని ఆమె పేర్కొంది. అయితే, చిలుక చెప్పిన విషయాల ఆధారంగా కేసు నమోదుచేయలేమని పోలీసులు అంటున్నారు. టీవీలో రాసలీలల దృశ్యాలు చూసి.. ఆ మాటల్ని చిలుక వల్లేవేస్తూ ఉండవచ్చునని, చిలుక మాటల ఆధారంగా నేరాన్ని నిరూపించడం కష్టమని పోలీసులు అంటున్నారని అరబ్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో అక్రమ సంబంధం కలిగి ఉండటం నేరం. ఈ నేరం రుజువైతే కఠినమైన జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
పనిమనిషితో భర్త గుట్టు విప్పిన చిలుక!
Published Thu, Oct 27 2016 10:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement