రిపబ్లిక్ డే వేడుకల్లో గుండె పోటుతో టీచర్ మృతి | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్ డే వేడుకల్లో గుండె పోటుతో టీచర్ మృతి

Published Mon, Jan 26 2015 11:44 AM

teacher dies of heart attack in republic celebrations

నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలోని గోరేన్ కల్ పల్లిలో స్కూల్ లో తొలిసారి జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకల్లో  అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పటివరకూ వేడుకగా సంబరాల్లో పాల్గొన్న ఉపాధ్యాయుడు ఎర్రమాడ నరేంద్ర రెడ్డి (53)  గుండె పోటుతో మృతిచెందారు.

 

 ప్రైమరీ స్కూల్ టీచర్లు రిపబ్లిక్ డే వేడుకల్లో ఉండగా  ఆ ఉపాధ్యాయుడు తీవ్ర అస్వస్థతకు లోనై అక్కడికక్కడే కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచారు. దీంతో పాఠశాలలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement
Advertisement