'నేడు సంచలన సంఘటనలు ఉంటాయి' | Sakshi
Sakshi News home page

'నేడు సంచలన సంఘటనలు ఉంటాయి'

Published Wed, Jun 17 2015 8:21 AM

'నేడు సంచలన సంఘటనలు ఉంటాయి'

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ల ట్యాపింగ్ కేసులో మరో 48 గంటల్లో సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఒక  ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు, కేంద్రంలో ఉంటున్న ఒక ముఖ్యనేత, అదే స్థాయి గల ఇంకో నేత...మొత్తం అయిదుగురి అరెస్ట్కు రంగం సిద్ధమైందన్నారు. ఎన్నటీఆర్ట్ ట్రస్ట్ భవన్లో నిన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ట్యాపింగ్ వ్యవహారంలో దొరికిన ఆధారాలన్నింటినీ కోర్టు ముందు పెడతామని పేర్కొన్నారు. కేసు బుక్ చేయడమే కాదని, జైలుకు కూడా పంపుతామన్నారు.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఆంధ్రప్రదేశ్ సీబీసీఐడీ దూకుడు పెంచింది. ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ నమోదు అయిన  కేసుల దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర ముఖ్యనేతల ఫోన్ ట్యాపింగ్పై విజయవాడలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement