శాసించేది యువతే.. | Sakshi
Sakshi News home page

శాసించేది యువతే..

Published Wed, Apr 16 2014 3:15 AM

శాసించేది యువతే.. - Sakshi

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో అర్హులైన ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 25,61,171 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. వీరిలో మహిళలు 12,79,468 కాగా.. పురుషులు 12,81,491 మంది ఉన్నారు.

అయితే ఈ సంవత్సరం జనవరి 31 తరువాత ఓటు కోసం కొత్తగా దర ఖాస్తు చే సుకున్న వారిలో అర్హులైన 64,573 మందికి అధికారులు తుది జాబితాలో చోటు కల్పించారు. ప్రస్తుతం ప్రకటించిన తుది జాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లకన్నా మహిళా ఓటర్లు 2023 మంది తక్కువగా ఉన్నారు.
 
 పెరిగిన యువ ఓటర్లు

 ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల యువతీయువకులు చైతన్యం పొంది పెద్ద ఎత్తున ఓటు నమోదు చేసుకున్నారు. తాజా జాబితాలో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్కులు 7,62,636 నమోదై ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో యువత కనీసం 50వేలకు తగ్గుకుండా ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 74,086 మంది యువతీయువకులు  ఉన్నారు.
 
 తర్వాత స్థానం మహబూబాబాద్ లో 69,060 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు.  ప్రస్తుత జాబితాలో జిల్లావ్యాప్తంగా ‘ఇతరులు’ 212 మంది ఓటర్లుగా నమోదయ్యారు. వారిలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 88 మంది ఉన్నారు. కాగా,  డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, వరంగల్ తూర్పు, ములుగులో మహిళా ఓటర్లు పురుషుల కన్నా అధికంగా ఉన్నారు.
 

Advertisement
Advertisement