Sakshi News home page

ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా చర్యలు

Published Sun, Dec 21 2014 12:24 AM

ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా చర్యలు - Sakshi

ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ
ఇబ్రహీంపట్నం: నేరాల అదుపునకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ పి.నారాయణ పేర్కొన్నారు. ప్రజలు పోలీ సులకు సహకరిస్తే నేరాలను నియంత్రించవచ్చని ఆయన చెప్పారు. జనాలు పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. శనివారం ఆయనను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది.  

సాక్షి: శివారు ప్రాంతాల్లో తరచూ అసాం ఘిక కార్యకలాపాలు వెలుగుచూస్తున్నాయి. మీ పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు..?
 
ఏసీపీ: అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. సాధారణ పోలీ సులతో పాటు మఫ్టీ పోలీసులతో నిరంతరంగా నిఘా ఏర్పాటు చేస్తున్నాం.
 
సాక్షి: ఇబ్రహీంపట్నం శివారు ప్రాంతాల్లోని కొన్ని గోదాంలలో అక్రమాలు జరుగుతున్నాయి..? అక్రమార్కులు కల్తీ ఆయిల్ తదితరాలు తయారు చేస్తున్నారు..?

ఏసీపీ: ఇప్పటికే పౌర సరఫరాలు, విజిలెన్స్ శాఖ అధికారులకు సమాచారం అందజేశాం. అధికారులు చర్యలు తీసుకుంటారు. గోదాం లలో జరిగే అక్రమాలపై ప్రజలు కూడా పోలీసులకు సమాచారం అందిస్తే బాగుంటుంది.
 
సాక్షి: కొన్ని కేసుల్లో రాజకీయ నాయకులు తలదూరుస్తున్నారు. దీంతో బాధితులకు ఇబ్బంది కలుగుతోంది..?
 
ఏసీపీ: ప్రజలు కొందరు అవగాహన రాహిత్యంతో రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. మా పరిధిలో నాయకుల ప్రమేయం లేకుండా చూస్తున్నాం. బాధితులు నేరుగా పోలీసులను సంప్రదిస్తే న్యాయం చేస్తాం.
 
సాక్షి: యువతను చైతన్యం చేసేందుకు ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారా..?

 
ఏసీపీ: ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో బెల్టు దుకాణాలు, సారా అక్రమ విక్రయాలు అధికంగా ఉన్నాయి. వాటిపై జనాల్లో అవగాహన తెస్తే కొంతమేర ప్రయోజనం చేకూరుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
 
సాక్షి: పోలీసులంటే జనాల్లో భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టేందుకు మేరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
 
ఏసీపీ: పోలీసులంటే జనం భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించాం. మా సిబ్బంది జనాలతో మమేకమై పనిచేస్తున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తే నేరాలను చాలా వరకు అదుపు చేయవచ్చు.
 
సాక్షి: సారా విక్రయాలపై ఏవిధంగా స్పందిస్తున్నారు..?
 
ఏసీపీ: సారా తయారీ, విక్రయాలు నేరం. సారా తయారీదారులు స్వచ్ఛందంగా తమ వృత్తి వదిలేసి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలి. ప్రజలు చైతన్యవంతమై సారా మహమ్మారికి దూరంగా ఉండాలి. సారా తాగితే అనారోగ్యం పాలవుతారు. ఇల్లు గుల్లవుతుంది. కుటుం బీకులు కూడా తీవ్ర ఇబ్బందులపాలవుతారు.

adsolute_video_ad

What’s your opinion

Advertisement
Advertisement