సీఎం కేసీఆర్కు రమణ్సింగ్ లేఖ | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్కు రమణ్సింగ్ లేఖ

Published Fri, Dec 2 2016 3:05 AM

సీఎం కేసీఆర్కు రమణ్సింగ్ లేఖ - Sakshi

ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల కొనుగోళ్లకు గతంలో ఒప్పందం

 సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన లాంఛనాలను సత్వరంగా పూర్తి చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం 2015 సెప్టెంబర్ 22న దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ఖరీదైన ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి గుదిబండగా మారనుందని విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ ఒప్పందం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీమాంసలో పడింది. దీంతో ఇంత వరకు ఈ ఒప్పందానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) ఆమోద ముద్ర వేయలేదు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరలు తగ్గించేందుకు ఒప్పందంలో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈఆర్సీ సూచిం చింది. ఈ విషయంలో టీఎస్‌ఈఆర్సీ ఇంత వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వు లు జారీ చేయకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో గతంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇంధన మంత్రి ఓ సారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అరుునా, స్పందన లేకపోవడంతో తాజాగా ఛత్తీస్‌గఢ్ సీఎం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.

Advertisement
Advertisement