ఇంద్ర చేతుల మీదుగా 'ఇంద్ర సేన' ఫస్ట్ లుక్ | Sakshi
Sakshi News home page

ఇంద్ర చేతుల మీదుగా 'ఇంద్ర సేన' ఫస్ట్ లుక్

Published Sun, Sep 3 2017 11:47 AM

ఇంద్ర చేతుల మీదుగా 'ఇంద్ర సేన' ఫస్ట్ లుక్

బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. ఒక్క సినిమాతో టాలీవుడ్ లోనూ స్టార్ హీరోగా మారిపోయిన విజయ్, తరువాత తన ప్రతీ సినిమానూ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బిచ్చగాడు స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇంద్రసేన.

సి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ ఇంద్ర మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల పలు చిన్న చిత్రాల ప్రమోషన్ కు ముందుకు వస్తున్న మెగాస్టార్ ఈ తమిళ హీరోకు సాయం చేసేందుకు ఓకె చెప్పారు. ఈ నెల 5న మెగాస్టార్ ఇంద్రసేన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంద్రసేన సినిమా విజయ్ ఆంటోని స్వయంగా రాధిక శరత్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement