వచ్చేస్తున్నాయ్! | Sakshi
Sakshi News home page

వచ్చేస్తున్నాయ్!

Published Tue, Aug 4 2015 12:27 AM

వచ్చేస్తున్నాయ్! - Sakshi

5 ఎఫ్‌ఓబీలు.. 103 బస్‌బేలు
రూ. 9.18 కోట్లతో నిర్మాణం టెండర్ల ఆహ్వానం
త్వరలో పనులు ప్రారంభం

 
సిటీబ్యూరో: విశ్వనగరంలో భాగంగా జీహెచ్‌ఎంసీ 103 బస్‌బేలు, 5 ఎఫ్‌ఓబీ (ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి)ల నిర్మాణానికి సిద్ధ మవుతోంది. తాజాగా దీనికి టెం డర్లు పిలిచింది. మొత్తం రూ.9.18 కోట్లతో ఐదు ఎఫ్‌ఓబీ/సబ్‌వేలు, 103 బస్‌బేల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. త్వరలోనే నూతన విధానంలో వీటిని నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న బస్‌బేలు రోడ్డుపైకొంతభాగాన్ని ఆక్రమించడంతో బస్సులు రహదారిపైఆగుతున్నాయి. రెండు మూడు బస్సులు ఒకేసారి వస్తే వెనుకనున్న దాన్ని ప్రయాణికులు చూసే లోపునే అక్కడి నుంచి కదిలిపోతోంది. రోడ్డుపైనే బస్సులు ఆగుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు రోడ్డుపైనే కాకుండా... ప్రభుత్వ స్థలాలు ఉన్న చోట ప్రధాన రహదారికి కొంత దూరంగా... దాదాపు అర్థవలయాకారంలో వీటిని నిర్మించనున్నారు. దీని కోసం మొత్తం 340 ప్రభుత్వ స్థలాలను గుర్తించారు.

103 ప్రాంతాల్లో తొలిదశలో నిర్మిస్తారు. ఇందుకు గాను రూ.5.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాదచారులు  రోడ్డు దాటేందుకు లిఫ్టులతో కూడిన 150 ఎఫ్‌ఓబీలను నిర్మించాలనేది యోచన. ఐదు ఎఫ్‌ఓబీలకు ఇదివరకే టెండర్లు పూర్తయ్యాయి. కొత్తగా మరో 5 ఎఫ్‌ఓబీలకు టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.4.03 కోట్లు. ఈ లిఫ్టుల నిర్వహణ బాధ్యతను వికలాంగులకు అప్పగిస్తారు. తద్వారా వారికి ఉపాధి లభిస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ యోచిస్తున్నారు. సిగ్నల్ రహిత ప్రయాణానికి త్వరలోఎస్సార్‌డీపీ కింద రూ.2,631 కోట్లతో ఫ్లై ఓవర్లు తదితరమైన వాటికి టెండర్లు పిలవనున్నారు. ఈ పనులను ఒక్కొక్కటిగా ప్రారంభించనున్నారు.

ఎఫ్‌ఓబీలు నిర్మించే ప్రాంతాలు
1. ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజి
2. శంషాబాద్ బస్ స్టాప్
3. ఐఎస్ సదన్, సంతోష్ నగర్
4. నెహ్రూ జూలాజికల్ పార్కు
5. నేషనల్ పోలీస్ అకాడ మీ (శివరాంపల్లి) బస్‌బేలు

నిర్మించే ప్రదేశాలు కాప్రా సర్కిల్‌లో..
 1.శ్రీరాంనగర్‌కాలనీ 2.రాధికా జంక్షన్ 3. తిరుమల నగర్ రోడ్ 4. హౌసింగ్ బోర్డు కాలనీ 5. నాచారం 6.చక్రిపురం చౌరస్తా(కుషాయిగూడ).
 ఉప్పల్ సర్కిల్‌లో..
 7. గాంధీ విగ్రహం 8. ఉప్పల్ చౌరస్తా (ఉప్పల్-నాగోల్) 9. కుమ్మరిబస్తీ 10. ఉప్పల్ చౌరస్తా (ఉప్పల్-హబ్సిగూడ) 11. నాగోల్(ఎల్‌బీనగర్-ఉప్పల్) .
 ఎల్‌బీనగర్ సర్కిల్‌లో..
 12. కర్మాన్‌ఘాట్ (భూపేశ్‌గుప్తా నగర్) 13. వీఎంహోమ్(సరూర్‌నగర్).
 సర్కిల్-4లో..
  14. సైదాబాద్ (ప్రింటింగ్‌ప్రెస్ రోడ్డు) 15. గడ్డిఅన్నారం 16. టీవీ టవర్ 17. సైదాబాద్ (సరూర్‌నగర్-సైదాబాద్)18. దోబీఘాట్ 19. సైదాబాద్ (సరూర్‌నగర్ చెరువు-ఏసీపీ కార్యాలయం) 20. చాదర్‌ఘాట్ 21. బార్కాస్ 22. చాంద్రాయణగుట్ట 23 నుంచి 25 వరకు డీఆర్‌డీ ల్ వద్ద  26.మిథాని బస్ డిపో(మిథాని-చాంద్రాయణగుట్ట) 27. కేంద్రీయ విద్యాలయ
 సర్కిల్- 5లో ..
 29, 30. జుమ్మేరాత్ బజార్ 31. గోడేకి ఖబర్ 32. మోతిగల్లి
 రాజేంద్రనగర్ సర్కిల్‌లో..
 33, 34 రాజేంద్రనగర్ 35.మైలార్‌దేవ్‌పల్లి 36, 37. బుద్వేల్ ఎక్స్‌టెన్షన్ బస్ స్టాప్  38. దుర్గానగర్ చౌరస్తా  39, 40 ఆరాంఘర్ చౌరస్తా 41. శివారంపల్లి (ఎన్‌పీఏ).
 సర్కిల్ -7లో..
 42. టీఎన్జీవో భవనం(మాసాబ్ ట్యాంక్ రోడ్డు) 43.నానల్‌నగర్ చౌరస్తా 44.దిల్‌షాద్‌నగర్ కాలనీ.
 సర్కిల్-8లో..
 45. ఇంటర్మీడియట్ బోర్డు పక్కన 46. నిజాం కాలేజి 47. హజ్‌హౌస్ 48. ఎన్‌ఎస్‌రోడ్(అబిడ్స్) 49. బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ (జీపీవో పక్కన).
 సర్కిల్-9లో..
 50.  ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 51. సీపీఎల్ రోడ్ 52. వైఎంసీఏ చౌరస్తా 53. విజ్ఞాన్‌పురి (ఓయూ రోడ్డు) 54.బాగ్‌లింగంపల్లి రోడ్డు 55. నల్లకుంట 56. ఎస్‌వీఎస్ స్కూల్ 57. ముషీరాబాద్ 58. విద్యానగర్ 59.ఓయూ క్యాంపస్ 60. ఫీవర్ హాస్పిటల్ రోడ్ 61, 62, 63.  నారాయణగూడ 64. విజయనగర్ కాలనీ 65.అంబర్‌పేట 66. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్డు (ముషీరాబాద్) 67. శివం రోడ్డు.
 సర్కిల్-10లో..
 68. సనత్‌నగర్ 69. ధరంకరణ్ రోడ్డు
 శేరిలింగంపల్లి-1 సర్కిల్‌లో..
 70. కొండాపూర్ 71 నుంచి 78 వరకు గచ్చిబౌలి జాతీయ రహదారి
 శేరిలింగంపల్లి-2 సర్కిల్‌లో...
 79.కొత్తగూడ 80.మాదాపూర్
 ఖైరతాబాద్ సర్కిల్‌లో...
 81 నుంచి 86 వరకు నేషనల్ హైవే, కూకపట్‌పల్లి రోడ్డు
 కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో...
 87.ఐడీపీఎల్‌కాలనీ 88. సూరారం 89. షాపూర్ నగర్ చౌరస్తా 90, 91. చింతల్ 92.సుచిత్ర జంక్షన్ 93. జీడిమెట్ల.
 అల్వాల్ సర్కిల్‌లో..
 94. అల్వాల్ మెయిన్ రోడ్డు 95. కౌకూరు 96. యాప్రాల్ 97. కౌకూర్‌విలేజ్
 సికింద్రాబాద్ సర్కిల్‌లో..
 98.మినిస్టర్ రోడ్ 99. తార్నాక 100. లాలాపేట 101.బోయిగూడ రోడ్డు 102. చిలకలగూడ రోడ్డు 103. నార్త్‌లాలాగూడ రోడ్డు.
 
ఇది వరకే టెండర్లు ఆహ్వానించిన ఎఫ్‌ఓబీలు
 1. టిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్‌హౌస్
 2. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం
 3. మహావీర్ హాస్పిటల్, మాసాబ్‌ట్యాంక్
 4. కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్
 5. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్, గ్రీన్‌హౌస్.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement