ఉత్సాహమే ఊపిరి | Sakshi
Sakshi News home page

ఉత్సాహమే ఊపిరి

Published Fri, Apr 3 2015 11:26 PM

ఉత్సాహమే ఊపిరి

 ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘ఫ్ల్లారిషింగ్ ఇండియా’ చర్చావేదిక ఆసక్తికరంగా సాగింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో శుక్రవారం నిర్వహించిన ఈ చర్చా వేదికలో ప్రసిద్ధ రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్‌తో పాటు నగరంలోని వ్యాపార, ఇతర రంగాల మహిళలు, వారి జీవిత భాగస్వాములతో కలసి పాల్గొన్నారు. చేతన్ భగత్ మాట్లాడుతూ... ‘ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ నుంచి రైటర్‌గా మారడానికి స్పెషల్ ప్లాన్స్ ఏమీ చేయలేదు. అయితే అదో కాలిక్యులేటెడ్ రిస్క్. భారత్‌లో మార్పు కోరుకుంటున్నందు వల్లే నేను రైటర్‌ను అయ్యాను. నా ఆలోచనలు, రచనలు అందర్నీ చేరుకోవడానికి అనువైన మాధ్యమం ఎంటర్‌టైన్‌మెంట్.

హీరోను కాకపోయినా... నేను మాట్లాడినప్పుడు యూత్ వింటోంది. మరింత మందిని చేరుకోవడానికి ఓ టీవీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతున్నా’ అని చెప్పుకొచ్చిన చేతన్... తాను రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. హీరో వస్తున్నాడంటే పరిగెత్తే ఎనర్జీ, లైవ్లీనెస్ జీవితంలో నిత్యం నింపుకోవడం ముఖ్యమని ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు సలహా ఇచ్చారు. ‘జీవితం నలభై ఏళ్లకే అయిపోతుందనుకునే వాళ్లు ఒక్కసారి రాజకీయ నాయకులను చూస్తే ఎన్నో నేర్చుకోవచ్చు. పండు వయసులోనూ రాజకీయాలపై వారికున్న మక్కువ చూస్తుంటే... జీవితం ఇంకా ఎంతో మిగిలుందనిపిస్తుంది’ అంటూ మహిళలను ఉత్సాహపరిచారు. ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ ఫ్లో చైర్‌పర్సన్ మౌనిక అగర్వాల్ పాల్గొన్నారు.  
  ఓ మధు
 

Advertisement
Advertisement