
తండ్రి మాటే బాటగా..ఆశయ సాధనే లక్ష్యంగా
కొంతమంది నాయకుల మాటలే అసలైన నాయకత్వంగా మిగిలిపోతాయి. కొంతమంది నాయకుల సిసలైన విశ్వసనీయత ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయి.
కొంతమంది నాయకుల మాటలే అసలైన నాయకత్వంగా మిగిలిపోతాయి. కొంతమంది నాయకుల సిసలైన విశ్వసనీయతే ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయి. కొంతమంది వేసిన అడుగులే ఆదర్శానికి జాడలవుతాయి. కొంతమంది నడిచిన దారులే మార్గదర్శకాలవుతాయి. అటువంటి మార్గదర్శకులే ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన నవ్వు, నడక, మనసు, మమత అంతా కూడా జనహితం కోసమే పరితపించాయి. వైఎస్ ను ప్రజలు ఎంత ఆదరించారో..అంతకంటే ఎక్కువగా వైఎస్ ఆ ప్రజల కష్టాలకు వారధిగా నిలిచారు. జనహితం కోసం మొదలైన ప్రయాణం ఎప్పుడూ ఆగిపోదు.. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అలా వచ్చిన నేతే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఆ మహానేత అడుగులే వారసత్వంగా వణికిపుచ్చకున్ననేత జగన్ మోహన్ రెడ్డి. విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన రాజశేఖరుని లక్షణాలనే జగన్ కూడా అందిపుచ్చుకున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎవ్వరూ చవిచూడని కష్టాలు తుఫాన్ మాదిరి దూసుకొచ్చినా జగన్ ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. రైతన్న దగ్గర్నుంచి చేనేత వరకూ, విద్యార్థి దగ్గర్నుంచి మహిళల సమస్యల వరకూ నిరంతర పోరు సాగించారు. లక్ష్యదీక్ష, చేనేత దీక్ష, ఫీజు పోరు, సాగు పోరు, జలదీక్ష, హరితయాత్ర ఇలా తదితర అంశాలపై పోరాటం చేసి ప్రజల దగ్గరైయ్యారు జగన్. ఇలా గత ఐదేళ్ల నుంచి తన ప్రయాణాన్నిప్రజలతోనే సాగిస్తున్నారు జగన్. ఇచ్చిన మాట కోసం ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడిన జగన్ ను ప్రజలు ఆదరించారు. అలా ప్రజలకు దగ్గరై .. మడతిప్పని ఆ రాజశేఖరుని బిడ్డగా జగన్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ప్రస్తుతం జగన్ సాగించేది ప్రయాణం కాదు.. మాట తప్పని ప్రమాణం.