నరేంద్ర మోడీ గాలి లేదు:కాంగ్రెస్ వ్యతిరేక పవనాలే | prakash Karat bats for Third Front, dismisses Modi 'wave' | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోడీ గాలి లేదు:కాంగ్రెస్ వ్యతిరేక పవనాలే

May 3 2014 11:34 PM | Updated on Mar 29 2019 9:24 PM

నరేంద్ర మోడీ గాలి లేదు:కాంగ్రెస్ వ్యతిరేక పవనాలే - Sakshi

నరేంద్ర మోడీ గాలి లేదు:కాంగ్రెస్ వ్యతిరేక పవనాలే

ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గాలి వీస్తోందన్న వార్తలను సీపీఎం కొట్టిపారేసింది.

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ గాలి వీస్తోందన్న వార్తలను సీపీఎం కొట్టిపారేసింది. దేశంలో మోడీ గాలికానీ, బీజేపీ గాలికానీ లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్నది కాంగ్రెస్ వ్యతిరేక పవనాలేఅని, అయితే కొద్ది మంది దీనికి వక్రభాష్యం చేపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేక పవనాల వల్ల ప్రాంతీయ పార్టీలకు సైతం లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడతాయని ఆయన జోస్యం చెప్పారు.

 

బీజీపీ అభివద్ధి పేరుతో చేస్తున్న ప్రచారం అంతర్గతంగా మతపరమైన ప్రచారం కూడా ఇమిడి ఉందని, దీనికి ఆర్‌ఎస్‌ఎస్ నేతత్వం వహిస్తోందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement