అతివలదే ఐటీ | Sakshi
Sakshi News home page

అతివలదే ఐటీ

Published Wed, Nov 30 2016 1:47 AM

అతివలదే ఐటీ

ఐటీ రంగంలో మహిళలకు పుష్కలంగా అవకాశాలు
  నైపుణ్యముంటే లక్ష్యసాధన సులభం
సాంకేతిక రంగాల్లో పట్టుంటే ఉజ్వల భవిష్యత్తు
శ్రీచైతన్యలో ’ఉమెన్‌రాక్ ఐటీ’ అంతర్జాతీయ సదస్సు

శాతవాహన యూనివర్సిటీ/అల్గునూర్ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నతంగా ఎదగాలంటే సాంకేతిక నైపుణ్యాలు అవసరమని, ఐటీ రంగంలో మహిళలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రోబోక్రేజీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సాక్షి అన్నారు. పట్టుదలతో మొదటినుంచీ మెలకువలు నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ఆంగ్లభాషపై పట్టు, పాఠ్యాంశాలపై పూర్తి అవగాహనతోపాటు మారుతున్న టెక్నాలజీల వైపు దృష్టిపెడితేనే విద్యార్థులు విజయతీరాలకు చేరుకుంటారని వివరించారు. తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం టాస్క్, సిస్కో నెట్‌వర్కింగ్ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థారుు ఉమెన్‌రాక్ ఐటీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు మెలకువలు, ప్రస్తుత ఐటీ రంగంలో అవసరాలు, అర్హతలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. హెచ్‌సీఎల్, రోబోక్రేజ్ కంపెనీల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
 
విద్యార్థులకు అవసరం
టాస్క్ ఆధ్వర్యంలో సిస్కో కంపెనీ తరఫున మొత్తం 25 కళాశాలల్లో ఉమెన్ రాక్ ఏటీ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. మహిళలు ఐటీరంగంలో ఉద్యోగాల సాధనకు కావాల్సిన అంశాలు, టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రస్తుతం ఐటీ రంగంలో 40 శాతం వరకు మహిళలు ఉన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స అనే విషయంలో విద్యార్థినులకు అవగాహన కల్పించాం. - భాస్కర్, టాస్క్ డెరైక్టర్
 
ఐవోటీ గురించి చెప్పారు
ప్రస్తుతం ఐటీ సెక్టర్ చాలా పెరిగింది. ఐటీ కంపెనీలు మహిళలకు ఇస్తున్న ప్రాధన్యత, కంపెనీల్లో ఎలా ఉద్యోగాలు సాధించుకోవాలనే విషయాలు క్షుణ్ణంగా వివరించారు. ఐవోటీ(ఇంటర్నెట్ ఆన్ థింగ్‌‌స) టెక్నాలజీపై తెలిపారు. ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే విధానం, దాని ప్రయోజనాల గురించి నేర్చుకున్నాం. సీ,సీపీపీ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తోపాటు ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ పట్టు సాధించాలని తెలిపారు. మా కళాశాల సైతం దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుతుంది.

Advertisement
Advertisement