కన్న కూతుళ్లపైనే అత్యాచారం! | Sakshi
Sakshi News home page

కన్న కూతుళ్లపైనే అత్యాచారం!

Published Tue, Oct 1 2019 4:10 PM

Molestation Case Filed Against Father In Wales - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇలా తలమున ఇంతటి ఘోరం మరోటి ఉండకపోవచ్చు. ఆగ్నేయ వేల్స్‌కు చెందిన  కామంధుడైన ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లపై పదే పదే అత్యాచారం చేయడంతోపాటు వారిలో ఓ కూతురి ద్వారా ఆరుగురి సంతానానికి తండ్రయ్యాడు. ఆ తండ్రి తన కూతుళ్లకు 16వ ఏట వచ్చినప్పటి నుంచే వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడట. తండ్రితో శంగార జీవితాన్ని పంచుకున్నట్లయితే గగన సీమలోని విచిత్ర మాయా లోకంలో మిగతా జీవితం స్వర్గతుల్యమవుతుందంటూ మాయమాటలు చెప్పి కూతుళ్లను రొంపిలోకి దింపాడట. తాను ఒక్కడే కాకుండా మరి కొంత మంది విటులను కూడా కూతళ్ల వద్దకు పంపించే వాడట.

ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చిందో తెలియదుగానీ స్వాన్‌సీ క్రౌన్‌ కోర్టు విచారణకు సోమవారం వచ్చినప్పుడు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జాన్‌ హిప్కిన్, జ్యూరీకి కేసు వివరాలను వెల్లడించారు. కూతుళ్లపైనే ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ తండ్రిపై 36 రేప్‌ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఆ దేశం చట్ట నిబంధనల ప్రకారం ప్రధాన నిందితుడి పేరుగానీ, బాధితుల పేర్లుగానీ, ఇతర వివరాలనుగానీ మీడియాకు వెల్లడించలేదు. ఈ కేసు విచారణ మూడు వారాలు కొనసాగి తీర్పువెలువడవచ్చని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హిప్కిన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement