ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు

Published Sat, May 21 2016 2:29 AM

ఐడీబీఐ బ్యాంక్ నష్టం రూ.1,736 కోట్లు

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.1,736 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిల కేటాయింపులు రెండు రెట్లు పెరగడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-14) ఇదే క్వార్టర్‌కు రూ.546 కోట్ల నికర లాభం వచ్చిందని ఐడీబీఐ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిశోర్ కారత్ చెప్పారు. 2014-15 క్యూ4లో రూ.9,382 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ,8,275 కోట్లకు తగ్గిందని తెలిపారు.  ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 0.47 శాతం క్షీణించి రూ.64.1 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement