బెజవాడలో రౌడీ అనేవాడు ఉండకూడదు | without rowdy sheeters in vijayawada, says chandrababu naidu | Sakshi
Sakshi News home page

బెజవాడలో రౌడీ అనేవాడు ఉండకూడదు

Sep 27 2014 7:01 PM | Updated on Sep 2 2017 2:01 PM

బెజవాడలో రౌడీ అనేవాడు ఉండకూడదు

బెజవాడలో రౌడీ అనేవాడు ఉండకూడదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతున్న విజయవాడలో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతున్న విజయవాడలో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బెజవాడలో రౌడీ అనేవాడే ఉండకూడదన్నారు. ఇక నుంచి తాను విజయవాడవాసినే అని, ఇక్కడే ఎక్కువ కాలం ఉండి పాలన సాగిస్తానని అన్నారు. ప్రపంచ టూరిజం డే సందర్భంగా ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ  టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఢిల్లీ నిర్భయ ఉదంతంతో టూరిస్టులు భయపడే పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే టూరిస్టులు సందర్శనలకు వస్తారని, దాంతో ఆదాయం పెరుగుతుందన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు.

మాఫీయాను క్షమించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పుడప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జరుగుతాయన్నారు.  వినోదం కోసం కోడిపందాలు ఆడితే తప్పులేదని అయితే డబ్బు పెట్టి ఆడటం నేరమన్నారు. హైదరాబాద్ బిర్యానీని మించిన వంటకాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వీజీటీ వుడాను మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement