చెత్తను సంపదగా మార్చే ఆలోచన

చంద్రబాబు నాయుడు-నిర్మలా సీతారామన్


విజయవాడ: చెత్తను సంపదగా మార్చే ఆలోచన చేస్తున్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈరోజు ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలలో 5 అంశాలు తీసుకున్నట్లు తెలిపారు.



అవసరమైన చోట్ల సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛంగా తయారుచేద్దాం అని పిలుపు ఇచ్చారు. వీలైన త్వరగా రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పనులను వేగవంతం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.

***

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top