'చంద్రబాబు పుట్టిన తేదీలోనే 420' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పుట్టిన తేదీలోనే 420'

Published Fri, Jan 30 2015 3:58 PM

'చంద్రబాబు పుట్టిన తేదీలోనే 420' - Sakshi

ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై 420 కేసు పెట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. చంద్రబాబు పుట్టిన తేదీలోనే 420 ఉందన్నారు. (చంద్రబాబు పుట్టినరోజు ఏప్రిల్ 20) పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షతో బాబుకు పతనం ప్రారంభం అవుతుందని చెవిరెడ్డి అన్నారు.

ఎన్నికల మేనిఫెస్టో అమలుచేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన హెచ్చరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి రైతు దీక్షలో పాల్గొనడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.

Advertisement
Advertisement