
ఆ పోస్టులపై మాత్రం నోరు మెదపని టీడీపీ
సామాజిక మాధ్యమాల్లో ఓ సామాన్యుడు పోస్టులు పెట్టాడని అరెస్టుకు ఆదేశించిన టీడీపీ ప్రభుత్వం..
సామాజిక మాధ్యమాల్లో ఓ సామాన్యుడు పోస్టులు పెట్టాడని అరెస్టుకు ఆదేశించిన టీడీపీ ప్రభుత్వం.. తన పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇతర పార్టీల నాయకుల వ్యక్తిత్వాలను కించపరిచేలా పెట్టిన పోస్టులపై మాత్రం నోరు మెదపడంలేదు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వైఎస్‌ఆర్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ వెబ్‌సైట్‌లో విచ్చలవిడిగా పెట్టిన పోస్టుల్లో ఇవి మచ్చుకు కొన్ని. ఇందుకు ఎవర్ని అరెస్టు చేస్తారు చంద్రబాబూ?...
కాగా తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పొలిటికల్ పంచ్ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్ (35)ను నిన్న అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అభ్యంతరకరంగా వెబ్‌సైట్‌లో ప్రచారం చేస్తున్నందుకుగాను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు అరెస్ట్ సమయంలో రవికిరణ్ భార్యతో వెల్లడించారు. కాగా రవికిరణ్ అరెస్ట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ప్రభుత్వ పనితీరు సరిగాలేదని విమర్శిస్తే అరెస్ట్‌లు చేయడం ఎంతవరకు సబబు అని నెటిజనులు ప్రశ్నించారు.