'డీజిల్ రూ. 21, పెట్రోల్ రూ. 29కి విక్రయించాలిగా' | Sakshi
Sakshi News home page

'డీజిల్ రూ. 21, పెట్రోల్ రూ. 29కి విక్రయించాలిగా'

Published Wed, Jan 28 2015 1:23 PM

'డీజిల్ రూ. 21, పెట్రోల్ రూ. 29కి విక్రయించాలిగా' - Sakshi

హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన ఆ దిశగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదని ఏపీపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి బుధవారం హైదరాబాద్లో ఆందోళన వ్యక్తం  చేశారు. అంతర్జాతీయంగా తగ్గిన ముడి చమురు ధరల ప్రకారం అయితే  లీటరు డీజిల్ ధర రూ. 21, పెట్రోల్ రూ.29 కి వినియోగదారులకు అందించాలని అన్నారు.

కానీ అలా జరగడం లేదని రఘువీరా ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడి చుమురు ధరలు తగ్గితే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని మాజీ ప్రధాని వాజ్పాయి విధానానికి ప్రస్తుత మోదీ సర్కార్ తూట్లు పోడుస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మోదీ సర్కార్ దొంగచాటుగా మూడు సార్లు పన్నుల పెంచి ప్రజలను దోపిడి చేస్తోందని విమర్శించారు. ఈ దుర్మార్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతామనడం అన్యాయమన్నారు.

Advertisement
Advertisement