శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను పరిశీలిస్తా | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను పరిశీలిస్తా

Published Thu, Jul 24 2014 12:04 AM

శాంతిభద్రతలు,  ట్రాఫిక్‌ను పరిశీలిస్తా - Sakshi

ఏటీఅగ్రహారం (గుంటూరు): అర్బన్ జిల్లాలో శాంతి భద్రతలు,ట్రాఫిక్ సమస్యలను పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్టు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు.
 
 గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా రాజేష్‌కుమార్ బుధవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ నుంచి చార్జి తీసుకున్నారు. అనంతరం ఎస్పీ రాజేష్‌కుమార్ విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే...
 ‘‘ అర్బన్ జిల్లా పరిస్థితులపై అవగాహన పెంపొందించుకొని ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను గుర్తించి తదుపరి చర్యలు చేపడతా. నా భార్య నీతూ ప్రసాద్ 2002లో గుంటూరు జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో, విధి నిర్వహణలో భాగంగా బందోబస్తు నిమిత్తం మూ డుసార్లు మాత్రమే గుంటూరు వచ్చాను. అంతకు మించి జిల్లాపై అవగాహన లేదు.
 
 అధికారులు, మీడియా, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం సేకరిస్తా. మీడియా ప్రతినిధులు, విలేకరులు సహకారం అందిస్తూ సమాచారం తెలియజేస్తే వెంటనే చర్యలు చేపడతా.’’
 
 తొలుత గుంటూరులోని పోలీస్‌క్లబ్‌కు చేరుకున్న ఎస్పీ రాజేష్‌కుమార్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
 
  కాకినాడలోని 3వ బెటాలియన్ కమాండెంట్‌గా వున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు.
 అధికారుల అభినందనలు.. ఎస్పీ రాజేష్ కుమార్‌ను ఏఎస్పీలు జానకీధరావత్, బి. శ్రీనివాసులు, ఓఎస్‌డి కె. జగన్నాథరెడ్డి, డీఎస్పీలు గంగాధరం, టివీ. నాగరాజు, కె. నరసింహ, బి. మెహర్‌బాబా, ప్రసన్న కుమార్, బిపి. తిరుపాల్, ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్పీ పీఆర్‌ఓ ఎస్. వెంకట బాలసుబ్రహ్మణ్యం,  సీఐలు, ఎస్సైలు, ఎస్పీ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కలసి అభినందనలు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement