ప్రధానికి ముద్రగడ పద‍్మనాభం లేఖ | Sakshi
Sakshi News home page

ప్రధానికి ముద్రగడ పద‍్మనాభం లేఖ

Published Wed, May 24 2017 12:30 PM

ప్రధానికి ముద్రగడ పద‍్మనాభం లేఖ - Sakshi

కాకినాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. దేశవ్యాప్తంగా వీఐపీలకు ఎర్రబుగ్గలను తొలగించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అని ప్రధానిని ముద్రగడ ప్రశంసించారు.

అలాగే ఎర‍్రబుగ్గలను తొలగించిన వారికి పైలట్‌, ఎస్కార్ట్‌ వాహనాలను కూడా తొలగించే ఆలోచన చేయాలని ముద్రగడ ప్రధానిని కోరారు. గన్‌మెన్‌లు, పోలీసులు, బ్లాక్‌ కమాండోస్‌ వలయంలో పాలన చేయడం తనకు సమంజసంగా అనిపించడం లేదని ముద్రగడ పేర్కొన్నారు. పైలట్‌, ఎస్కార్ట్‌ వాహనాలలోని పోలీసులు సైరన్‌లతో అలజడి చేస్తూ ప్రజానికాన్ని భయబ్రాంతులకు గురిచేసే సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు.

చట్టసభల్లో ఉన్న గౌరవ సభ్యులు, మాజీ సభ్యులకు గన్‌మెన్‌ సౌకర్యం వి.వి.ఐ.పి లకు హైసెక్యూరిటీతో పోలీసుల వలయం చాలావరకు దుర్వినియోగం అవుతోందని, దీని వల్ల ప్రభుత్వాలకు ఖర్చు పెరుగుతుందని ముద్రగడ అన‍్నారు. కాబట్టి.. అవసరమైన వారికి మాత్రమే సెక్యూరిటీ ఉంచి మిగిలిన వారికి తొలగించే ఆలోచన చేయాలని ముద్రగడ పద్మనాభం ప్రధానిని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement