సీఎం జగన్‌ కృషి అభినందనీయం | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ కృషి అభినందనీయం

Published Tue, May 5 2020 9:38 PM

Former MLA Vishweshwar Reddy Thanks CM YS Jagan - Sakshi

సాక్షి, అనంతపురం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముంబైలో చిక్కుకున్న వలస కూలీలను రప్పించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముంబై నుంచి గుంతకల్లుకు రేపు(బుధవారం) ఉదయం వలస కూలీలు చేరుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన 500 మంది వలస కార్మికులు రానున్నారని తెలిపారు. వలస కూలీలపై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం సీఎం జగన్‌ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement