ఏలూరులో విషాదం | Sakshi
Sakshi News home page

ఏలూరులో విషాదం

Published Thu, May 25 2017 9:13 AM

ఏలూరులో విషాదం - Sakshi

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని బీడీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

మృతులు పద్మావతి(60), సంతోషిరూప(35), సాయి సిద్దార్థ(9), సాయిరామ్‌(5)లుగా గుర్తించారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలను పరిశీలించి నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కొంతకాలం క్రితం కుటుంబసభ్యులను కోల్పోవడంతో.. మనస్థాపం చెంది ఈ తీవ్ర నిర్ణయం తీసుకొని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మరణాల వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement