బాబు మనవడికి బుల్లెట్‌ప్రూఫ్ కారు | Bullet-proof car to Grandson of Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు మనవడికి బుల్లెట్‌ప్రూఫ్ కారు

Apr 20 2015 2:38 AM | Updated on Sep 3 2017 12:32 AM

బాబు మనవడికి బుల్లెట్‌ప్రూఫ్ కారు

బాబు మనవడికి బుల్లెట్‌ప్రూఫ్ కారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారసుడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు అందుబాటులోకి వచ్చింది.

కాపలాగా ఇప్పటికే నలుగురు కానిస్టేబుళ్లు
సాక్షి,హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు మనవడికి కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు అందుబాటులోకి వచ్చింది. ఉగాది పర్వదినాన బాబు తనయుడు లోకేష్, బ్రాహ్మణి దంపతులకు కుమారుడు పుట్టిన సంగతి విదితమే. నారావారి వారసుడు ప్రస్తుతం తన తాతైన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ నిమిత్తం నిన్నమొన్నటివరకు తాత బాబు వినియోగించిన స్కార్పియో బుల్లెట్‌ఫ్రూఫ్ కారు ఆదివారం నుంచి నారా వారి వారసుడికి అందుబాటులోకి వచ్చింది. గతంలోనే  నలుగురు కానిస్టేబుళ్లతో భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.
 
ఇంటికి పరిమితమైన చంద్రబాబు..
ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నెల 12న చైనాకు వెళ్లిన చంద్రబాబు 17వ తేదీరాత్రి తిరిగి ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం సచివాలయంలో అధికారిక కార్యకలాపాలలో పాల్గొన్న సీఎం ఆదివారాన్ని పూర్తిగా తన కుటుంబసభ్యులకే కేటాయించారు.కాగా చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కేక్ కట్ చేసి, తర్వాత అనంతపురం పర్యటనకు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, టీడీపీ ఏపీ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువనేత నారా లోకేష్‌ని నియమించాలని పంచాయతీరాజ్‌శాఖ మం త్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ అధిష్టానాన్ని కోరారు.

Advertisement

పోల్

Advertisement