గడువు దాటితే నిధులకు బ్రేక్ | Sakshi
Sakshi News home page

గడువు దాటితే నిధులకు బ్రేక్

Published Thu, Jul 30 2015 12:11 AM

Break expiration funds

 గంట్యాడ: మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ సాగునీటి కాలువల అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయకపోవడంపై జపాన్ బృంద సభ్యులు  కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోపల పనులు పూర్తి చేయకపోతే నిధులను నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. జపాన్ నిధులు రూ.23కోట్లతో మండలంలో అభివృద్ధి చేస్తున్న తాటిపూడి ఆయకట్టు సాగునీటికాలువ పనులను జపాన్ బృంద సభ్యులు మరియామా,కిమోవా,ఢిల్లీకి చెందిన సిన్హాలు బుధవారం పరిశీలించారు. 2011లో మంజూరైన అయకట్టు కాలువల అభివృద్ధి పనులు గడువులోపల పూర్తి కాకపోవడంతో ఒకసారి గడువు అడిగారు. 2015 ఖరీఫ్ ప్రారంభం నాటికి ఇచ్చిన గడు వు పూర్తి అయినప్పటికీ పనులు 60 శాతం మాత్రమే జరిగాయి.
 
 దీనిపై మళ్లీ 2016 మార్చి వరకు సంబంధిత కాంట్రాక్టర్ గడువు  కోరారు.ఈమేరకు వళ్లీ గడువు ఇస్తే పనులు పూర్తి చేయగలరా, లేదోనని జపాన్ బృంద సభ్యులు కాలువను పరిశీలించారు. మార్చివరకు కోరిన గడువును డిసెంబర్ వరకు మాత్రమే ఇస్తామని అప్పటిలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నాన్యతపై వేరే సిబ్బంది పర్యవేక్షిస్తారన్నా రు. అనంతరం తాటిపూడి రిజర్వాయర్‌ను పరిశీలించి రిజర్వాయర్ నిర్మా ణం, రిజర్వాయర్ అయకట్టు,విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం, ఇన్‌ఫ్లో తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుక న్నారు. అనంతరం సీఈఓ శివరామ ప్రసాద్ మాట్లాడు తూ జపాన్  నిధులతో చేపట్టిన అభి వృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని బృంద సభ్యులు సూచించారన్నా రు. డిసెంబర్‌లోగా పనులు పూర్తి చే సేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ నాగేశ్వర్రావు, ఈఈ రమణమూర్తి,డీఈ అప్పలనాయుడు, ఏఈ  కృష్ణమూర్తి  పాల్గొన్నారు.
 
 అక్టోబర్‌కు పనులు పూర్తిచేయాల్సిందే
 వేములాపల్లి (శృంగవరపుకోట): వేములాపల్లి గ్రోయిన్ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని జపాన్ నుంచి వచ్చిన జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(జె.ఐ.సి.ఏ) సభ్యులు బుధవారం నిర్ద్వంద్వంగా చెప్పారు.  తాటిపూడి రాజర్వాయర్ ఆధునికీకరణకు జపాన్ నిధుల్లో భాగంగా 2012లో రూ.24.64కోట్లు కేటాయించగా వాటిలో వేములాపల్లి ఆనకట్ట నిర్మాణానికి రూ.3.5కోట్లు కేటాయించారు. గత  ఏడాది ప్రారంభించిన  వేములాపల్లి గ్రోయిన్ పనులను జపాన్ బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు.
 
 ముందుగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ  ఆనకట్ట ఆయకట్టు, నిర్మాణం, పనులు ప్రగతి, ఆనకట్ట వల్ల గ్యాప్ ఆయకట్టు 2326 ఎకరాల్లో భాగంగా చివరి భూములకు నీరు అందింస్తామంటూ జపాన్ బృందానికి చెప్పారు. పనులకు సంబంధించిన రిపోర్టులు, డ్రాయింగ్‌లు చూపారు. ఈసందర్భంగా  జపాన్ బృంద సభ్యులు మాట్లాడుతూ పనులు ఎప్పుడు పూర్తిచేస్తారని అడగ్గా ఇరిగేషన్ అధికారులు మార్చినాటికి పూర్తిచేస్తాం అంటూ చెప్పారు. దీంతో వారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి పూర్తిచేయాలి.  లేకుంటే ఫండింగ్ చేయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జపాన్ ప్రతినిధి బృందంతో పాటు ఇరిగేషన్ సీఈ శివరామప్రసాద్,  ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఈఈ ఎం.వి.రమణ, డీఈ అప్పలనాయుడు, జేఈ శివరామకృష్ణ తదితర ఉద్యోగులు, కాంట్రాక్టరు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement