స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి | Bhuma Nagi Reddy collapsed in Care Hospital | Sakshi
Sakshi News home page

స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి

Apr 24 2014 2:25 PM | Updated on Aug 20 2018 8:52 PM

స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి - Sakshi

స్పృహ కోల్పోయిన భూమా నాగిరెడ్డి

వైఎస్‌ఆర్‌ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

హైదరాబాద: వైఎస్‌ఆర్‌ సీపీ నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శోభానాగిరెడ్డి మరణవార్త తెలియగానే ఆమె భర్త భూమా నాగిరెడ్డి కేర్ ఆస్పత్రిలో స్పృహ కోల్పోయారు. వైద్య సిబ్బంది సపర్యలు చేయడంతో ఆయన కోలుకున్నారు. తన భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేకపోక విషాదంలో మునిగిపోయారు.

ఇక భూమా దంపతుల ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. తల్లి మృతదేహాన్ని చూసి వారు భోరున విలపించారు. తమ తల్లి మరణాన్ని తట్టుకోలేక శోక సంద్రంలో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. భూమా శోభానాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement