'నిబంధనల పేరుతో నిధులు ఆపేస్తున్నారు' | Sakshi
Sakshi News home page

'నిబంధనల పేరుతో నిధులు ఆపేస్తున్నారు'

Published Sun, Dec 21 2014 2:20 PM

'asha' Ramana murthy takes on chandrababu govt

విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంలో రోజుకోరకంగా మార్పులు తీసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రతినిధి రమణమూర్తి ఆరోపించారు.  ఆదివారం విజయవాడలో జరిగిన ఆశా సర్వసభ్య సమావేశానికి రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ప్రనిధిలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ... నిబంధనల పేరుతో ఆసుపత్రులకు నిధులు ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలుగా అనిపిస్తున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై ఎన్ని సార్లు అడిగినా పాత, కొత్త ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్లో ఓపీ సేవలు అందించడం సాధ్యం కాదని రమణమూర్తి స్పష్టం చేశారు. మా సమస్యలపై ఈ నెల 24వ తేదీన జరిగే సమావేశంలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని రమణమూర్తి తెలిపారు.

Advertisement
Advertisement