ప్రత్యేక హోదాతోనే ఆంధ్రా అభివృద్ధి | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాతోనే ఆంధ్రా అభివృద్ధి

Published Wed, Jul 29 2015 2:52 AM

Andhra specific capacity development

పీఎన్ కాలనీ:  ప్రత్యేక హోదాతోనే ఆంధ్రా అభివృద్ధి సాధ్యమని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. పట్టణంలోని క్రాంతి భవన్‌లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రాష్ర్ట విభజన తర్వాత వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరిగిందని సమితి అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఎస్‌టీయూ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జోసఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం తలపెట్టే కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా బిల్లును తీసుకురావాలన్న ప్రధాన డిమాండ్లతో ఉద్యమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని నమ్మబలికిన కేంద్రం ఇప్పుడు మాట మార్చి నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నుంచి బయటపడేందుకు ఉద్యమించడం ఒక్కటే మార్గమన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ ప్రజా సంఘాల నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధానకార్యదర్శి చాపర వెంకటరమణ, ఉపాధ్యాయ సంఘాల నేతలు గొంటి గిరిధర్, జగన్మోహన్, పేడాడ ప్రభాకర్, డేనియర్, డి.జానకీరావు, ఎస్.ప్రసాద్, రైతుకూలీ సంఘం రాష్ట్ర నేతలు చాపర సుందర్‌లాల్, జిల్లా నేతలు అప్పలనాయుడు, న్యాయవాదుల సంఘం నేతలు అన్నంనాయుడు, ఏఐటీయూసీ జిల్లా నేత చిక్కాల గోవిందరావు, పీఆర్‌టీయూ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, ఏపీయూడబ్యూజే జిల్లా కార్యదర్శి బగాది శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement