'మా పార్టీ అండగా ఉన్నందునే రైతులకు పరిహారం పెంపు' | Sakshi
Sakshi News home page

'మా పార్టీ అండగా ఉన్నందునే రైతులకు పరిహారం పెంపు'

Published Fri, Feb 27 2015 4:18 PM

'మా పార్టీ అండగా ఉన్నందునే రైతులకు పరిహారం పెంపు' - Sakshi

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం పరిహారం పెంచడానికి వైఎస్సార్ సీపీనే కారణమని ఆ పార్టీ  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పాతికవేల ఎకరాలను సేకరించగా, ప్రభుత్వ భూములు దాదాపు 15 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. ఆ నలభై వేల ఎకరాలు ఏపీ రాజధాని నిర్మాణానికి సరిపోయే నేపథ్యంలో మళ్లీ భూసేకరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈనెల 28 తర్వాత భూసేకరణ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనకు కట్టుబడి ఉంటారా?అని నిలదీశారు.

 

భూసేకరణ ఆర్డినెన్స్ పై కేంద్రమే పునరాలోచనలో పడిన విషయం మీకు గుర్తు లేదా?అని ఆర్కే ప్రశ్నించారు. భూసేకరణపై ఏపీ సర్కార్ మొండిగా ముందుకెళ్తే కోర్టును ఆశ్రయిస్తాని ఆయన హెచ్చరించారు. పరిహారం విషయంలో కౌలు రైతులు, రైతు కూలీల ప్రస్తావనే లేదని ఆయన విమర్శించారు. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల జోలికి వెళ్లవద్దన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement