అన్నింటికి ఒకే రిమోట్ | Sakshi
Sakshi News home page

అన్నింటికి ఒకే రిమోట్

Published Sun, Jul 5 2015 10:52 AM

అన్నింటికి ఒకే రిమోట్

స్మార్ట్ ఫోన్ రిమోట్‌టీవీ కోసం ఒకటి... డీవీడీ ప్లేయర్ కోసం ఇంకోటి... ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల కోసం మరికొన్ని. ఈ రోజుల్లో ఇళ్లల్లో ఉండే రిమోట్ కంట్రోలర్ల సంఖ్య లెక్క ఇది. ఒకేఒక స్మార్ట్‌ఫోన్‌తో వీటన్నింటినీ పక్కకు పడేయగలిగితే ఎంత బాగుంటుందో కదా!

ఇదే ఆలోచనతో హైదరాబాద్ కేంద్రంగా ఇటీవలే స్మార్ట్‌ఫోన్ల తయారీ చేపట్టిన సెల్‌కాన్ కంపెనీ ‘ఏ 35కే’ను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సల్ రిమోట్ తాలూకూ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు రెండింటినీ పొందుపరిచి దీన్ని రూపొందించామని కంపెనీ తెలిపింది.

పీల్ అనే అంతర్జాతీయ సంస్థ అభివృద్ధి చేసిన టెక్నాలజీ కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌తో దాదాపు 500 బ్రాండ్ల టీవీలను పనిచేయించవచ్చునని, అలాగే 700 వరకూ సెట్‌టాప్ బాక్స్‌లకూ రిమోట్‌గా పనిచేస్తుందని కంపెనీ వివరించింది. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకూ ఇది ప్రత్యామ్నాయం కాగలదని సెల్‌కాన్ అంటోంది. ఇంకెందుకు ఆలస్యం. ఇంట్లో రిమోట్లన్నింటినీ పక్కన పడేసి ఈ స్మార్ట్ ‘ఫోన్’ రిమోట్‌ను తెచ్చేసుకోండి మరి!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement