ఆటో, సుమో ఢీ: 10 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆటో, సుమో ఢీ: 10 మందికి గాయాలు

Published Fri, Sep 4 2015 6:45 PM

10 injured of auto and sumo accident

ఆలమూరు: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బొమ్మిలేరు వద్ద శుక్రవారం సాయంత్రం ఆటోను సుమో వాహనం ఢీకొనడంతో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తొమ్మిది మంది ప్రయాణికులతో ఆటో మండపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఓఎన్‌జీసీకి చెందిన సుమో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పది మందికీ (డ్రైవర్తో సహా) తీవ్ర గాయాలు కాగా, వారిని రాజమండ్రి, ఆలమూరు, మండపేట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement