250 Crores Dalit Bandhu Scheme Funds Released By Telangana Government - Sakshi
Sakshi News home page

Dalit Bandhu: గుడ్‌న్యూస్‌.. ఆ నాలుగు జిల్లాలకు దళితబంధు నిధుల విడుదల

Published Wed, Dec 22 2021 2:47 AM

Telangana: Rs 250 Crore Released For Dalit Bandhu Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధు పథకం అమలు కోసం ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు మొత్తం రూ.250 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో మంగళవారం జమ చేసింది.

సూర్యాపేట జిల్లా తుం గతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి రూ.50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానికి రూ.100 కోట్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండకు రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గానికి చెందిన నిజాంసాగర్‌కు రూ.50 కోట్ల చొప్పున కలెక్టర్ల ఖాతాలో జమ అయినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.  
(చదవండి: తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్‌ కేసులు)

Advertisement
 
Advertisement
 
Advertisement