ప్రతి చోట పెరిగిన ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

ప్రతి చోట పెరిగిన ఓటింగ్‌

Published Wed, May 15 2024 5:10 AM

-

పోలింగ్‌కు మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పోటెత్తారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటేసేందుకు తరలివచ్చారు. గతంతో పోలిస్తే జిల్లాలో ఈసారి దాదాపు రెండు నుంచి మూడు శాతం మేర పోలింగ్‌ పెరిగింది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 83 శాతం ఓటింగ్‌ నమోదైంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోవడం.. ప్రతిపక్షంపై సానుకూలత లేకపోవడం వంటి అంశాలపై విశ్లేషకులు తమ మనోగతాన్ని తెలియజేస్తున్నారు. ఈ పోలింగ్‌ సరళి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీవైపే మొగ్గుచూపుతుందని చెప్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం తాము ప్రకటించిన మేనిఫెస్టో అనుకూలంగా మారిందని ప్రచారం చేసుకుంటూ ఆనందం పొందుతోంది.

డబ్బును పారించిన పచ్చ పార్టీ

క్షేత్రస్థాయిలో టీడీపీ గ్రాఫ్‌ అంత గొప్పగా లేకపోవడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వానికి తెరలేపారు. ఓటుకు భారీ మొత్తంలో పంపిణీ చేశారు. అయితే సంక్షేమ సారథి జగన్‌మోహన్‌రెడ్డికే ప్రజలు జై కొట్టారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కారణంతోనే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు భారీగా ఓటేశారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement