పాక్‌కు పరీక్ష! నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా.. అలీ స్థానంలో అతడే! | Sakshi
Sakshi News home page

Pak Vs SA: బవుమా తిరిగి వచ్చేశాడు.. ఆ ముగ్గురు అవుట్‌! బాబర్‌ ఆజం ఏమన్నాడంటే..

Published Fri, Oct 27 2023 1:43 PM

WC 2023 Pak Vs SA: Toss Playing XIs Babar Azam Says Happy To do Well Myself Good - Sakshi

ICC ODI WC 2023- Pak Vs SA: వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్‌ మైదానంలో సౌతాఫ్రికాను తొలుత బౌలింగ్‌కు ఆహ్వానించింది.

ఈ సందర్భంగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్‌ చేస్తాం. ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ మాకు అత్యంత ముఖ్యమైనదే. ప్రతీ విభాగంలోనూ మేము మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌ లోపాలు సరిచేసుకోవాలి.

నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా
ఈ విషయాలన్నిటి గురించి అంతా కూర్చుని చర్చించుకున్నాం. నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రొటిస్‌ జట్టుతో మ్యాచ్‌కు హసన్‌ అలీ అనారోగ్యం కారణంగా దూరం కాగా.. వసీం జూనియర్‌ తుదిజట్టులోకి వచ్చినట్లు బాబర్‌ తెలిపాడు.

మూడు మార్పులతో సౌతాఫ్రికా
ఇక ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌ చేతిలో తప్ప ఓటమన్నది ఎరుగని సౌతాఫ్రికా.. మరో భారీ విజయంపై కన్నేయగా.. హ్యాట్రిక్‌ ఓటములకు చెక​ పెట్టాలని పాక్‌ భావిస్తోంది. ఈ శతాబ్దం ఆరంభం నుంచి ప్రొటిస్‌ జట్టుపై తమకున్న ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని పట్టుదలగా ఉంది.

కాగా పాక్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా.. తబ్రేజ్‌ షంసీ, లుంగి ఎంగిడి కూడా టీమ్‌తో చేరారు. రీజా హెండ్రిక్స్‌, కగిసో రబడ, లిజాద్‌ విలియమ్స్‌ దూరం కావడంతో ఈ ముగ్గురు రీఎంట్రీ ఇచ్చారు.

పాకిస్తాన్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా
తుదిజట్లు

పాకిస్తాన్‌
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రవూఫ్‌.

సౌతాఫ్రికా
క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), తెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్‌ మార్కరమ్‌, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్, తబ్రేజ్‌ షంసీ, లుంగి ఎంగిడి .

చదవండి: WC 2023: ఎవరు ఏం చెప్పినా వినాలి.. కెప్టెన్‌గా నేనున్నాంటే: రోహిత్‌ శర్మ 

Advertisement
Advertisement