సాకేత్‌ జోడీ సంచలనం  | Sakshi
Sakshi News home page

సాకేత్‌ జోడీ సంచలనం 

Published Thu, Feb 22 2024 4:08 AM

Saket Jodi Sensation - Sakshi

పుణే: మహారాష్ట్ర ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ సంచలన విజయంతో బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సాకేత్‌–రామ్‌ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్‌ పీటర్‌ మటూవ్‌స్కీ (పోలాండ్‌)–మాథ్యూ రోమియోస్‌ (ఆ్రస్టేలియా) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–రామ్‌ జోడీ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో అర్జున్‌ –జీవన్‌ (భారత్‌) 6–3, 6–3తో రిత్విక్‌ చౌదరీ–నికీ పూనాచా (భారత్‌)లపై నెగ్గగా... గంటా సాయి    కార్తీక్‌ రెడ్డి–కరణ్‌ (భారత్‌) 6–3, 3–6, 4–10తో ట్రిస్టన్‌–వాల్టన్‌ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement