ఒకటి గజదొంగ.. మరొకటి ఘరానా దొంగ  | Sakshi
Sakshi News home page

ఒకటి గజదొంగ.. మరొకటి ఘరానా దొంగ 

Published Thu, Apr 11 2024 4:24 AM

Union Minister Kishan Reddy on Congress and BRS - Sakshi

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

లాలాపేట(హైదరాబాద్‌): కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వేర్వేరు కాదని...ఒకటి గజదొంగ.. మరొకటి ఘరానాదొంగ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన తార్నాక, విజయపురికాలనీ మీదుగా మెట్టుగూడ వరకు పర్యటించారు. మెట్టుగూడలోని వైజంక్షన్‌ రోడ్డు వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.

రెండూ కుటుంబ పార్టీలని..ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తూనే ఉంటాయని లేదన్నారు, నెహ్రూ కుటుంబంలో వారి వారసులే ప్రధానులు అయ్యారు.. కేసీఆర్‌ తర్వాత ఆయన కుమారుడు, బిడ్డ, మనుమడే నాయకులుగా ఉంటారని చెప్పారు. రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యేది లేదని, ఎన్నికల తర్వాత ఆయన విదేశాలకు వెళతాడన్నారు.  

కేసీఆర్‌ కూతురు కవిత ఎక్కడుంది 
కేసీఆర్‌ కూతురు కవిత ఎక్కడుంది తెలుసా అంటూ కిషన్‌రెడ్డి ప్రజలను అడిగారు..వారంతా తిహార్‌ జైలులో అని సమాధానం ఇచ్చారు. తెలంగాణను దోచింది చాలదన్నట్టు డిల్లీలో బీరు, బ్రాండీ వ్యాపారం చేసిందని, వేల కోట్లు దోచుకుందామని వెళ్లి పట్టుబడిందన్నారు. గత పదేళ్ల పాలనలో పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని ఆశపెట్టి, ప్రజల నుంచి దోపిడీ చేసిన డబ్బులతో తండ్రి,కొడుకు, బిడ్డ తలా ఒక ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారని విమర్శించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement