రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Published Mon, Mar 4 2024 8:09 AM

PM Modi Telangana Tour And BJP Sabha Live Updates - Sakshi

PM Modi Telangana Tour Updates..

రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రాత్రికి అక్కడే బస

మరికాసేపట్లో రాజ్ భవన్‌కు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

స్వాగతం పలుకనున్న గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్,  మంత్రి పొన్నం ప్రభాకర్.

నా తెలంగాణ కుటుంబ సభ్యులారా.. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ తెలుగులో మోదీ ప్రసంగం ప్రారంభం. 

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్‌ భారత్‌ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. 

దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్‌ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్‌ను ప్రారంభించాం. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వికసిత్‌ భారత్‌పై నిన్న మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం.

బీజేపీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం. కుటుంబ పార్టీలను నమ్మవద్దు. కుటుంబ పార్టీలో రెండే అంశాలు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే. ఒకటి దోచుకోవడం, రెండోది అబద్ధాలు చెప్పడం. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగింది అన్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఏం చేస్తోంది?.

నా జీవితం తెరచిన పుస్తకం. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి. నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను.  నా జీవితం దేశం కోసం అంకితం. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను. 

ఆదీవాసీ సమాజం కోసం బీజేపీ కృషి చేస్తుంది. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా?. మోదీ గ్యారంటీపై దేశవ్యాప​ంగా చర్చ జరుగుతుంది. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం. 

రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. సమ్మక్క సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం. 

బీజేపీ సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో దేశ ముఖచిత్రాన్ని ప్రధాని మోదీ మార్చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి 17 సీట్లు రావాలి. కేసీఆర్‌ పార్టీ నిన్నటి పార్టీ. ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేసే పరిస్థితి లేదు. కుటుంబ, అవినీతి పాలనను కేసీఆర్‌ తెలంగాణ ప్రజలపై రుద్దారు.

బీజేపీ సభలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. గత 40 ఏళ్ల కాలంలో ప్రధాని హోదాలో ఒక్క ప్రధాని కూడా రాలేదు. ప్రధాని మోదీ మాత్రమే ఆదిలాబాద్‌కు వచ్చారు. ఆదిలాబాద్‌ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోంది. 

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బీజేపీ సభకు హాజరైన ప్రధాని మోదీ. 

ఆదిలాబాద్‌లో పార్టీ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోడీ

మోదీకి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావ్, నలుగురు ఎమ్మెల్యేలు

 ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్‌ కార్యక్రమాలు నిదర్శనం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. 

వికసిత్ భారత్‌ లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. రూ.56వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్టీపీసీ రెండో యూనిట్‌తో తెలంగాణ అవసరాలు తీరుతాయి. 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశాం. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుంది. 

ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుంది. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో భారత్‌ అభివృద్ధిపరంగా మరింత ముందుకెళ్తుంది. కేంద్రం తీసుకున్న చర్యలతో దేశవ్యాప్తంగా 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 

 రామగుండం ఎన్టీపీసీ స్టేజ్‌ వన్‌ పవర్‌ ప్లాంట్‌ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు వర్చువల్‌గా శంకుస్థాపన. ఆరు ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.

ఇప్పటికే పూర్తి అయిన 1600 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం. సుమారు 10,599 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్‌ నిర్మాణం. 

సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ప్రాజెక్ట్‌లో మిగిలిన వాటికి అన్ని విధాలుగా సహకరిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి సాదర స్వాగతం. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్‌ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తాం. 

మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్‌ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది. కంటోన్మెంట్‌ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి నిర్మించాలి. దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. 

 ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 

ఆదిలాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీ..

ఆదిలాబాద్‌ చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేతలు..

ఆదిలాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌,

నేడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. కాగా, మోదీ పర్యటన షెడ్యూల్‌లో చివరి నిమిషంలో స్వల్ప మార్పు జరిగింది. ఆయన ఈరోజు ఉదయం 11:30 గంటలకు నాగ్‌పూర్‌లో హెలిప్యాడ్‌ వద్దకు రానున్నారు. అంతకుముందు షెడ్యూల్‌(10:20 గంటలకు) కన్నా ఒక గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం కానుంది. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన కోసం నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. 

ఇక, తెలంగాణలో మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు (4న ఆదిలాబాద్‌లో రూ.6,697 కోట్లు, 5న సంగారెడ్డిలో రూ.9,021 కోట్లు) ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. 

అలాగే, రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోసం ‍ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభలు పార్టీ యంత్రాగానికి మరింత ఊపు తెస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.     

ఆదిలాబాద్‌లో  హైఅలర్ట్

  • ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ పర్యటనల నేపథ్యంలో భారీ భద్రత
  • ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం
  • రెండువేల మంది భద్రతతో రక్షణ వలయం

మోదీ పర్యటన ఇలా.. 
ప్రధాని సోమవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా కేందానికి చేరుకుంటారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాగా మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. 

అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా, అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పను­లకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు.

అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్‌రెడ్డితో పా­టు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొననున్నారు. ఆదిలాబాద్‌లో మోదీ సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక్కడినుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి నాందేడ్‌కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకుని రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.

మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చి ఆర్గనైజేషన్‌ (సీఏఆర్‌ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

ప్రధాని పర్యటన పురస్కరించుకుని మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇలావుండగా సోమవారం ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement