సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌లో అయోమయ పరిస్థితి! | Sakshi
Sakshi News home page

సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌లో అయోమయ పరిస్థితి!

Published Thu, Aug 17 2023 4:54 PM

Medak: Who Will Next Incumbent in Sangareddy Constituency - Sakshi

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యంత ఆసక్తిని రేపే నియోజకవర్గం ఇది. ఇక్కడి ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుంది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక.. బీఆర్ఎస్ రెండు సార్లు, బీజేపీ, టీడీపీ ఒక్కోసారి అధికారంలోకి వచ్చాయి.

మళ్లీ కాంగ్రెస్‌ పట్టు సాధించేనా?

కాంగ్రెస్‌లో స్ట్రాంగ్‌ లీడర్‌గా ఉన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి(అలియాస్ జగ్గారెడ్డి) 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండ తన సొంత క్యాడర్‌తో దూసుకుపోయాడు. 2004లో ఆయన తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. ఆ తర్వాత 2009, 2018లో మాత్రం కాంగ్రెస్ తరఫున గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్‌ సంగారెడ్డి అడ్డాగా ఉండేది. కానీ 2014 ఎన్నికల తర్వాత సీన్‌ మొత్తం​ మారింది. అక్కడ గులాబీ జెండ ఎగరింది.

దాంతో సంగారెడ్డిలో కాంగ్రెస్‌ వీక్‌ అయ్యి బీఆర్‌ఎస్‌ బలపడినట్లు అనిపించింది. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందడంతో సంగారెడ్డిపై మళ్లీ హస్తం పట్టు సాధించింది. ఇక తాజా పరిణామాలు ప్రకారం.. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో రాబోయే సంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిక సంగారెడ్డిలో ఉత్కంఠత నెలకొంది. 

నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు :

  •  మహబూబ్ చెరువు, మంజీర డ్యామ్ 

రాజకీయానికి అంశాలు

  • బీఆర్‌ఎస్‌లో అయోమయం
  • కార్ ఓవర్ లోడ్
  • అధిక పోటీలో బిఆర్ఎస్ నాయకులు
  • MLA  జగ్గారెడ్డి బిఆర్ఎస్‌లోఇక వెళ్ళే సూచనలు

ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు:    

  • రియల్  వ్యాపారం
  • హైదరాబాద్‌కి దగ్గర ఉన్నా నియోజక వర్గంలో మౌలిక  వసతుల  విషయంలో  పెద్దగా  అభివృద్ధి లేకపోవడం    

రాజకీయ పార్టీల వారీగా ప్రధాన పార్టీల టికెట్ల ఆశిస్తున్నవారు

బీఆర్ఎస్ 

  • చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే) 

కాంగ్రెస్  

  •  జగ్గారెడ్డి 

బిజేపి    

  • రాజేశ్వర్ రావు దేశ్ పాండే (బిజేపి నియోజక వర్గ ఇంచార్జ్)
  • శివరాజ్ పాటిల్    

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు :

  • నదులు : మంజీర నది
  • ఆలయాలు : వైకుంట పురం ఆలయం / ఇస్మాయిల్ ఖాన్  పేట భవానీ మాత ఆలయం 

Advertisement
 
Advertisement
 
Advertisement