కేసీఆర్‌ కోసం చింతమడక ప్రజల పడిగాపులు | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కోసం చింతమడక ప్రజల పడిగాపులు

Published Wed, Dec 6 2023 6:56 PM

KCR Staff Trouble Chintamadaka People At Erravelli Farmhouse - Sakshi

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో చాలా సేపు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది చింతమడక వాసులు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఫామ్‌ హౌజ్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

దాదాపు మూడు గంటల పాటు వాళ్లు ఫామ్‌హౌజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద ఆగిపోవడంతో.. ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా.. బీఆర్‌ఎస్‌ అధ్యక్ష హోదాతో పాటు తాజా మాజీ సీఎం కావడంతో ఇంకా సెక్యూరిటీ కొనసాగుతోంది.

Advertisement
Advertisement