‘విగ్గు’ మొగుడు నాకొద్దు | Sakshi
Sakshi News home page

‘విగ్గు’ మొగుడు నాకొద్దు

Published Fri, Jan 15 2021 7:04 PM

Woman Files Divorce After Discovering Husband Was Bald - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: అందమైన క్రాఫ్‌తో హీరోలా ఉన్నాడని పెళ్లి చేసుకుంది. ఐదేళ్లు కాపురం చేసిన తరువాత అది విగ్‌ అని, భర్తది బట్టతల అని తెలుసుకుని అవాక్కైంది. తనకు అన్యాయం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విడ్డూరం చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నై ఆలపాక్కంకు చెందిన రాజశేఖర్‌కు 27 ఏళ్ల యువతితో 2015లో వివాహమైంది. రాజశేఖర్‌కు బట్టతల కావడంతో విగ్‌ ధరించి పెళ్లి చూపులకు, వివాహానికి హాజరయ్యాడు. మేలైన సహజ వెంట్రుకలతో తయారుచేసిన విగ్‌ కావడంతో వధువు, ఆమె తరఫు బంధువులు గమనించలేదు.

ఇటీవల తలపై విగ్‌ లేని సమయంలో భార్య గమనించి బిత్తరపోయింది. దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను వాపసు చేయాలని డిమాండ్‌ చేయగా ఆమెపై భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త దాడి చేశారు. విగ్‌ పెట్టుకుని మోసగించిన భర్త రాజశేఖర్, అత్తింటి వారిపై చర్య తీసుకోవాలంటూ మంగళవారం బాధితురాలు చెన్నై తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్నెట్‌ వివాహ వేదికలోని వివరాలు చూసి మోసపోయానని ఆమె వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి:
భార్యను ఇంట్లోంచి నెట్టి.. బయటకు వచ్చేలోపు..

విద్యార్థులకు బంపరాఫర్‌.. 2జీబీ డేటా ఫ్రీ

Advertisement
 
Advertisement
 
Advertisement