XL, XXLలను వినే ఉంటారు.. X ఏమి సూచిస్తుంది? | Wearing A Shirt Of XL XXL Size, What Does X Mean In This, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Meanings Of X, XL, XXL: XLలో X ఏమి సూచిస్తుంది?

Published Mon, Oct 2 2023 10:59 AM

Wearing a Shirt of xl xxl Size What does x Mean - Sakshi

ఎవరైనా షర్ట్‌  లేదా టీ-షర్ట్‌ను కొనుగోలు చేయడానికి వస్త్ర దుకాణానికి వెళ్లినప్పుడు షర్టు నాణ్యత, రంగుతో పాటు కావాల్సిన సైజును ఎన్నుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి  మన సైజుకు సరిపడే షర్ట్‌ అందుబాటులో ఉండదు. అటువంటప్పుడు ఆ సైజు షర్ట్‌ కోసం మరో దుకాణానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే షర్ట్‌పై సైజులకు సంబంధించి XL లేదా XXL అని రాసివుండటాన్ని మీరు గమనించే ఉంటారు. దీనిలో  X అనేది ఏమి సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

సాధారణంగా XL(ఎక్స్‌ట్రా లార్జ్‌) సైజు షర్టు ఛాతీ కొలత 42 నుంచి 44 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 36 నుంచి 38 అంగుళాలు ఉంటుంది. ఇకముందు మీరు షర్ట్‌ కొనడానికి వెళ్లినపుడు మీ కావలసిన సైజు ఎంతనేది తెలియనప్పుడు మీ ఛాతీ, నడుము సైజును కొలవండి. అప్పుడు మీకు కావాలసిన షర్టు సైజు ఎంతో తెలుస్తుంది.

ఇక XXL విషయానికొస్తే ఇది ఎక్స్‌ట్రా లార్జ్‌ కన్నా పెద్ద సైజు కలిగినది. ఈ సైజు షర్ట్‌ లేదా టీ- షర్ట్‌  ఛాతీ కొలత 44 నుంచి 46 అంగుళాలు ఉంటుంది. నడుము పరిమాణం 38 నుంచి 40 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ పరిమాణం కొద్దిగా లావుగా ఉన్నవారికి సరిపోతుంది. ఎవరైనా తమ శరీర బరువు పెరిగినప్పుడు XXL సైజు దుస్తులు వేసుకోవాల్సి వస్తుంది. 
ఇది కూడా చదవండి: ‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు?

Advertisement
Advertisement