Truck Carrying Tomatoes Overturns In Telangana, Locals Came And Took Away Tomatoes - Sakshi
Sakshi News home page

Tomato Truck Over Turned: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!!

Published Fri, Jul 28 2023 11:37 AM

Tomato Lorry Over Turned Meanwhile - Sakshi

కర్ణాటక: టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ రోడ్డుపక్కన బోల్తాపడగా, స్థానికులు వచ్చి టమాటాలను ఊడ్చుకెళ్లారు. బుధవారం రాత్రి చెన్నపట్టణ తాలూకా సంకలగెరె గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.

ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందో తెలియరాలేదు. లారీ పడి ఉండడం, జనం పోటీపడి టమాటాలు తీసుకెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement