Rahman And Sajitha Got Married After 10 Years - Sakshi
Sakshi News home page

Palakkad: రెహమాన్‌–సజితా దంపతులయ్యారు

Published Thu, Sep 16 2021 5:50 AM

Rahman Sajitha got married after 10 years - Sakshi

పాలక్కాడ్‌ (కేరళ): రెహమాన్‌.. గుర్తున్నాడా? ప్రియురాలు సజితాను ఏకంగా పదేళ్లపాటు తన ఇంట్లోనే ఓ గదిలో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రెహమాన్‌ ఇప్పుడు ఆమెను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా నెన్‌మారా పట్టణంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద బుధవారం ఈ పెళ్లి జరిగింది.

పాలక్కాడ్‌ జిల్లా అయిలూర్‌కు చెందిన రెహమాన్‌ తన ప్రియురాలిని తన ఇంటి ప్రాంగణంలోనే ఓ గదిలో పదేళ్లపాటు రహస్యంగా దాచిపెట్టాడు. కొన్ని నెలల క్రితం బయటపడిన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. చట్టవిరుద్ధంగా యువతిని నిర్బంధించాడంటూ కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ అతడిపై కేసు పెట్టింది.

చదవండి: ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో!

Advertisement
 
Advertisement
 
Advertisement