Sakshi News home page

Kerala: ఆస్ట్రియన్‌ పర్యాటకురాలికి కేరళ పోలీసుల సమన్లు

Published Wed, Apr 17 2024 1:30 PM

Kerala FIR Filed Against Austrian Jewish Woman - Sakshi

కేరళలోని ఫోర్ట్‌ కొచ్చిలో వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. పాలస్తీనా అనుకూల పోస్టర్‌ను చింపివేసూ ఒక ఆస్ట్రియన్ యూదు పర్యాటకురాలు కేరళలో స్థానికులతో వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వారం ప్రారంభంలో ఎర్నాకులం జిల్లా ఫోర్ట్ కొచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఆ వీడియోలో పోస్టర్‌ను చింపివేస్తున్న ఆమెను వారించేందుకు స్థానిక యువకులు ప్రయత్నించగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ పోస్టర్‌  చినిగిన ముక్కలను తీయమని అక్కడున్న యువకులు ఆమెకు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ గోడపత్రికతో సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు ఆమెకు సూచించడాన్ని కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. 
 

ఈ వీడియో వైరల్‌గా మారిన నేపధ్యంలో కేరళ పోలీసులు విచారణ కోసం ఆ మహిళను పోలీస్‌ స్టేషన్‌కు రావాలని కోరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఓ)కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్ అజీమ్ కెఎస్ ఆ మహిళపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. ఎస్‌ఐవో అతికించిన పోస్టర్లను ఆ ఆస్ట్రియన్‌ యువతి చించివేసింది. 

కాగా గత జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్‌బక్స్ స్టోర్‌పై పాలస్తీనా అనుకూల పోస్టర్‌లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నాడు నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం స్టార్‌బక్స్ స్టోర్ గ్లాస్ డోర్‌పై ఆ విద్యార్థులు ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసిన పోస్టర్లను అతికించారు. గాజాలో జరిగిన యుద్ధ నేపధ్యంలో స్టార్‌బక్స్‌  ఇజ్రాయెల్‌కు అనుకూల వైఖరిని ప్రదర్శించినదుకు విమర్శలకు గురైంది.

Advertisement
Advertisement