‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్‌ రిలేషన్‌ షిప్‌కు ఎందుకు తావులేదు? | Sakshi
Sakshi News home page

‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్‌ రిలేషన్‌ షిప్‌కు ఎందుకు తావులేదు?

Published Sat, May 11 2024 12:40 PM

Friendship Marriage New Trend of Marriage Started in Japan

వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.

ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది.  ఇది జపాన్‌లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’  ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే  ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం  ఉండదు. జపాన్‌లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.

‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్‌ రిలేషన్‌ షిప్‌కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’అంటే మనకు నచ్చిన రూమ్‌మేట్‌ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు  ఇటువంటి ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్‌లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం.

Advertisement
 
Advertisement
 
Advertisement